మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడా…?

బాలీవుడ్ సినిమాలలో ప్రముఖ నటుడిగా పేరు పొందిన వ్యక్తి మనోజ్ బాజ్‌పాయ్. ఈయన కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.’ ది ఫ్యామిలీ మేన్‌ ‘వెబ్‌ సిరీస్‌ లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ఈ నెల 4 నుంచి ది ఫ్యామిలీ మేన్‌ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఇది ఇలా ఉండగా మనోజ్ బాజ్‌పాయ్ ‘ ది నైట్‌ మేనేజర్‌ ‘ అనే సిరీస్‌ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్‌ ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ మొదటిసారిగా నటించనున్నారు.

ఈ బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌ కు ఇండియన్‌ రీమేక్‌ గా తెరకెక్కుతుంది. ఇందులో విలన్‌ పాత్రకి మనోజ్‌ ని సంప్రదించారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల కారణంగా చిత్రీకరణలకు సంబంధించిన షెడ్యూల్స్‌ అన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఒప్పుకున్నా చిత్రాలను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. దీనితో ‘ ది నైట్‌ మేనేజర్‌’ లో నటించటానికి మనోజ్‌ కు డేట్లు సర్దుబాటు కాకపోవటం వల్ల ఆయన ఈ సిరీస్ నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం.