వైరల్ : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపిస్తున్న బన్నీ..!

తెలుగు ఇండ‌స్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న స్టైల్‌, డ్యాన్స్ న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ట‌చ్‌లోనే ఉంటారు. ఇక ఆయ‌న త‌న పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల‌తో క‌లిసి ఆడుకునే వీడియోలు నెట్టింట ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటాయి.

ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ త‌న పిల్ల‌లో క‌లిసి ఉన్న వీడియోను స్నేహ సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. నిన్న బుధవారం (జూన్ 2) ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు కాంతి వలయంగా ఏర్పడింది. నిన్న దాదాపు అంద‌రూ దీని గురించే సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇక అల్లు అర్జున్ కూడా బెడ్‌పై ప‌డుకుని త‌న పిల్ల‌కు ఈ సుందర దృశ్యాన్ని పిల్లలకు చూపిస్తూ సందడి చేశారు. దీన్నంతా స్నేహ వీడియో తీసి బాలీవుడ్ మూవీ Aisha లోని Sham సాంగ్‌ను బ్యాగ్రౌండ్‌లో యాడ్ చేసి పోస్టు చేశారు. మంచి ఫీల్ వచ్చింది. స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.