పెళ్లిలో వ‌ధువు కాళ్లు మొక్కిన వ‌రుడు.. ఎక్కడంటే…?

మాములుగా జరిగే పెళ్లి వేడుక‌ల్లో సాధార‌ణంగా వ‌ధువు వరుడు కాళ్లకు మొక్కుతుంది. తాళి కట్టే సమయంలో ఇంకా గౌరీ పూజ చేసినప్పుడు, పూల‌దండ‌లు మార్చుకున్న‌ప్పుడు ఎక్కువ సార్లు వ‌ధువు చేత వ‌రుడి కాళ్ల‌కు మొక్కిస్తుంటారు మన పెద్దలు. కానీ తాజాగా ఓ వివాహ వేడుక‌లో దీనికి పూర్తి భిన్నంగా జ‌రిగింది. ఏకంగా వ‌రుడే వ‌ధువు కాళ్ల‌ పై పడి మొక్కుకున్నాడు.

వివాహ తంతు అంతా పూర్తయ్యాక ఉన్నటుండి హఠాత్తుగా వరుడు వధువు కాళ్ల‌ పై ప‌డ్డాడు. ఈ సంఘటన చూసిన పెళ్ళికి విచ్చేసిన బంధు మిత్రులంతా ఆశ్య‌ర్చ‌పోయారు. ప్ర‌స్తుతం వ‌రుడు వ‌ధువు కాళ్ల‌ పై ప‌డ్డ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో కి అందరి నుండి అనేక లైక్‌లు ఇంకా కామెంట్ల వస్తున్నాయి. వరుడు అసలు వ‌ధువు కాళ్ల‌ పై ప‌డ‌టానికి గల కారణం తెలియచేసాడు. తన వంశాన్ని అభివృద్ధి చేయ‌డానికి తన ఇంటికి రాబోతుందని ఆమె కాళ్ల‌కు దండం పెట్ట‌డం త‌న బాధ్య‌త అని చెప్పాడు ఆ వరుడు. ఇంకా తన కుటుంబాన్ని మొత్తం వదిలి నాకోసం మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న తన కాళ్లకు దండం పెట్ట‌డం తన బాధ్యత అని, ఇందులో అసలు త‌ప్పేముంద‌ని ఎదురు ప్రశ్నిస్తున్నాడు వరుడు.