ఓ మూవీ రిలీజ్ చేయాలంటే కచ్చితంగా సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.ఈవెంట్లు నిర్వహించాల్సి వస్తుంది. అయితే.. ఈ ఈవెంట్లకు హాజరైన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎలాంటి నష్టం జరగకుండా.. నిర్మాతలు బాధ్యతలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ సినిమా ఈవెంట్లలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏవి జరగడం లేదు. దీంతో కొంతమంది ప్రాణనష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక ప్రాణం నష్టంకి హీరో, హీరోయిన్ల, నిర్మాతలు ఎవరు బాధ్యత వహించారు. అయితే.. ఇన్ని జరుగుతున్నా ఇప్పటికీ చాలా ఈవెంట్లు ఎలాంటి ప్లాన్ లేకుండా చేస్తున్నారు.
అందరికీ ఇబ్బందులు కలిగిస్తూ వస్తున్నారు. కానీ.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజమౌళి మాత్రం చాలా ముందు చూపుతో ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. మరి కొద్ది గంటల్లో గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన మొదటి నుంచే టీంకు ఈవెంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఎప్పుడూ ఎవరిని ఎలా ఈవెంట్లోకి పంపాలి.. ఆడియన్స్ ఎక్కడి నుంచి ఈవెంట్లోకి రావాలి.. స్పెషల్ గెస్ట్ లు ఏ రోడ్ నుంచి రావాలి.. ఇలా ప్రతి విషయాన్ని ఒక బోర్డ్ పై విశ్లేషణ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. పాస్‌పోర్ట్ లాంటి పాసులే కాదు.. ఫిజికల్ పాస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఏంట్రీ దక్కుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక.. దీనికోసం తన టీంతో స్పెషల్‌గా బోర్డ్ మీద డీటెయిల్స్‌ని కూడా వివరిస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది.
ఇక.. ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించనున్న సుమా.. ట్విట్టర్ వేదికగా ఆ పోస్టును షేర్ చేసుకుంది. ఇది కాస్త వైరల్‌గా మారడంతో చూసిన వాళ్లంతా రాజమౌళి డెడికేషన్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు. ఇక.. ఈ వీడియోలో క్లియర్ గా చూస్తే ఈవెంట్ ను ఎలా కండక్ట్ చేయాలి.. ఎప్పుడు ఎవరిని ఎలా ఎలర్ట్ చేయాలి.. ఫ్యాన్స్ ఎక్కడి వరకు రావాలి.. సుమా ప్రోగ్రాం ఎలా నడిపించాలి.. ఎప్పుడు ఈవెంట్ ముగించాలి.. ప్రోగ్రాంలో ఏది ఎక్కడ ఎలా జరగాలని విషయాలన్నీ దగ్గరుండి రాజమౌళి డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రాజమౌళితోపాటు కీరవాణి, సుమా ఇతర టీం మొత్తం పాల్గొన్నారు. ఈ ఈవెంట్ విషయంలో రాజమౌళి కేవలం ప్రమోషన్స్ మాత్రమే కాదు.. అంతకుమించి ఆడియన్స్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకున్న జక్కన ముందు చూపుకి ఫ్యాన్స్ హాట్సాఫ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. మీరు ఓ లుక్ వేసేయండి.
Winter is coming… and so is the #Globetrotter storm! 🌪️❄️
.#GlobeTrotter@ssrajamouli @urstrulyMahesh @priyankachopra @PrithviOfficial @mmkeeravaani @ssk1122 @ashchanchlani pic.twitter.com/MnGNPNYb5k— Suma Kanakala (@ItsSumaKanakala) November 14, 2025



