అఖండ 2 ఫ్రీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్ లీక్.. స్పెషల్ గెస్ట్ గా సిఎం..!

బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న 4వ సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా.. కనివిని ఎరుగని రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ గెస్ట్ గా రానున్నాడని.. దీనికోసం బోయపాటి ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Nandamuri Balakrishna and Boyapati Srinu's Akhanda 2: Thandavam Set To Hit  Theaters On THIS Date

శివతాత్వం, సనాతన ధర్మం నిదర్శనంగా అ్‌వ‌డ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అఖ‌వ‌డ‌ తాండవం లోను సనాతన ధర్మ వైభవాన్ని చూస్తారంటూ టీం ఇప్ప‌టికే వెల్లడించారు. ఈ క్రమంలోనే.. దానికి తగ్గట్లుగా అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హిందూ ధర్మానికి ప్రధాన కేంద్రమైన వారణాసి.. కాశీలో నిర్వహించాలని బోయపాటి శ్రీను ఫిక్స్ అయ్యాడట. గంగా నది తీరాన.. శివనామ స్మరణ మధ్య ఈవెంట్ జరిగితే సినిమాకు మరింత హైప్ వ‌చ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియాలో ఆడియన్స్ దృష్టిని సైతం తమ వైపు తిప్పుకోవచ్చని.. టీం ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య, యోగి కాంబినేషన్ అస్సలు ఆడియన్స్‌కే అందని ఓ మెగా ప్లాన్. ఈ క్రమంలోనే.. అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలని టీం చూస్తున్నారట.

Coronavirus: CM Yogi Adityanath's efforts to ramp up rural testing shows  results

బాలకృష్ణకు మొదటి నుంచి.. ఆధ్యాత్మిక, సనాతన భావాలు ఎక్కువ. అలాగే.. యోగి ఆదిత్యనాథ్ కూడా ఆధ్యాత్మిక నేత‌ అన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకే వేదికపై కలిస్తే.. అది పాన్ ఇండియా లెవెల్లో సినిమాకు మరింత ప్రాముఖ్య‌త‌ తెచ్చిపెడుతుందని నిర్మాతలు సైతం నమ్ముతున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్.. యోగి ఆదిత్యనాథ్ డివోష‌న‌ల్ మార్క్‌ కలిస్తే సినిమా ప్రమోషన్స్ కూడా అఖండ తాండవం లాగే ఉంటుందని నమ్మకం ఫ్యాన్స్ లో మొదలైంది. ఇక.. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వారణాసిలో కంప్లీట్ చేసుకుంటే మాత్రం.. రిలీజ్‌కి ముందే అఖండ 2 సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.