టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలకు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని.. కలెక్షన్ పరంగాన్ని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే.. ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక పవన్ కెరీర్లోనే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న రికార్డ్ సైతం సొంతం చేసుకుంది.
సుజిత్ డైరెక్షన్లో పవన్ స్టైల్, మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్.. ప్రతి ఒక్కటి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ రేంజ్లో సుజిత్ పవన్‌ను ఎలివేట్ చేశారు. ఈ క్రమంలోనే కంటెంట్ పెద్దగా లేకపోయినా.. ఆడియన్స్ పవన్ గ్రేస్ ను థియేటర్లో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. కాగా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెరకెక్కి.. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ.303 కోట్ల హైయెస్ట్ గ్రాస్ ను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా రికార్డును ఓజీ బ్రేక్ చేసి రూ.310 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేస్తుందని అఫీషియల్ గా మేకర్స్ వెల్లడించారు.
దీంతో.. 2025లో తెలుగు సినిమా నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ను రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం.. టికెట్ ధరలు తగ్గిన నేపథ్యంలో సినిమాకు మరింత ఆక్యుపెన్సి పెరిగింది. దీంతో.. సెకండ్ వీక్ లో కూడా మంచి కలెక్షన్లే రాబడుతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. సినిమా లాంగ్ రన్లో రూ.350 కోట్లు మార్కెట్‌ను దాటే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హిట్ సినిమాకు త్వరలోనే ఫ్రీక్వెల్, సీక్వల్ కూడా ఉంటాయి అంటూ సుజిత్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ సైతం వాటిలో నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ అభిమానులు.. ఫ్రీక్వెల్, సీక్వెల్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలంటూ రిక్వెస్ట్‌లు మొదలుపెట్టారు.