పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అర్జున్‌దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్ర న్తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా, డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల నడుమ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ సైతం ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంది.. పవన్ బ్లాక్ మాస్టర్ కొట్టాడా లేదా.. రివ్యూ లో చూద్దాం.
స్టోరీ:
ఓజస్ గంభీర్ అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్ ) చిన్నప్పటినుంచి అనాధగా.. జపాన్ సమరాయ సమూహంలో పెరిగి పెద్దవాడు అవుతాడు. ఈ ప్రయాణంలో.. తన మనుషులను, సంపదను కాపాడిన ఓజాస్ను.. సత్య దాదా (ప్రకాష్ రాజ్) సొంత కొడుకులా చూసుకుంటాడు. ముంబైలో పోర్ట్ పెట్టి.. వేలాతి మందికి ఉపాధి కల్పిస్తున్న సత్యా దాదాని ఓజాస్ జాగ్రత్తగా కాపాడుతూ వస్తాడు. కొన్ని కారణాలతో సత్యదాద కు ఓజీ దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ.. ఓమి బాహు (ఇమ్రాన్ హష్మి) మాఫియా డాన్ కారణంగా.. సత్య దాదా ఫ్యామిలీలో కొన్ని తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. పోర్ట్ ప్రమాదంలో పడుతుంది. దీంతో ఓజి తిరిగి ముంబై వస్తాడు. ఇంతకీ అసలు ఈ ఓమి ఎవరు..? అతని టార్గెట్ ఏంటి..? సత్య దాదా కి, పోర్ట్ కి అతని వల్ల వచ్చిన కష్టమేంటి..? ముంబైకి తిరిగి వచ్చిన ఓజీ అన్ని సమస్యలను పరిష్కరించాడా.. లేదా..? అసలు ఓమిని.. ఓ జి ఎలా ఢీకొట్టాడు..? అనేది మిగతా స్టోరీ.
రివ్యూ:
తెరపై తన ఫేవరెట్ హీరోని ఇలా చూసుకోవాలి.. అలా చూసుకోవాలని అంచనాలు ప్రతి అభిమానికి ఉంటాయి. అలాంటి ఓ వీరాభిమాని.. ఆ సినిమా డైరెక్టర్ అయితే.. హీరోను నాలాంటి అభిమానులందరికీ గూస్ బంన్స్ తప్పించేలా ఎలా చూపించాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సుజిత్ కూడా ఓజీ విషయంలో అదే చేశాడు. కథపై కూడా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. కథ విషయంలో కాస్త తడబడ్డాడు అనే ఫీల్ కలుగుతుంది. ఇక పవన్‌కు ప్రతి నిమిషం ఎలివేషన్స్ పై ఎలివేషన్ ఇచ్చే విషయంలో.. యాక్షన్ సీన్స్ లో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ విషయంలో పవన్ అభిమానుల్లో మంచి మార్కులే కొట్టేశాడు సుజిత్. కథ విషయంలోనే కాస్త వెనకబడ్డాడు అనిపించింది. ఇలాంటి టాలెంటెడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ అయినా.. గ్యాంగ్ స్టర్ డ్రామా అనే పాటకి ఒక మోసాలోకి వెళ్లిపోతారు అనడానికి ఓజీ ఏ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్.
మొదట్లో జపాన్ బ్యాక్ డ్రాప్‌ను తీసుకొని సమరాయుల శిక్షణ తీసుకున్న కుర్రాడిలా.. కాస్త కొత్తకోణాని చూపించే ప్రయత్నం చేసినా.. కథ గడిచే కొద్ది రొటీన్ పంథాలోకి వెళ్లిపోయింది. ఒక అనాధల ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం అందరినీ గడగడలాడించే రేంజ్‌కు ఆ హీరో ఎదగడం.. కొన్ని కారణాలతో ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్లిపోవడం.. మళ్లీ కొంతకాలానికి తిరిగి రావడం.. తన ఆధిపత్యాన్ని చూపించడం ఇదంతా ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో అలవాటైపోయిన ఫార్మాట్. ఇక పవర్ స్టార్ ఓజాస్ గంభీర్‌గా.. బాలు, పంజాలాంటి సినిమాలను గుర్తు చేశాడు. ఇక మలయాళ లూసిఫర్ టచ్ ఇచ్చి జపనీస్ భాష సైతం వాడి.. సినిమాకు కొత్త ఫీల్ కలిగించే ప్రయత్నాలు చేసినా.. అది వర్కౌట్ కాలేదు.
ఇక ఈ స్టోరీ విషయం ఎలా ఉన్నా.. పవన్ మాత్రం సూపర్ స్టైలిష్ లుక్‌లో బలమైన ఎలివేషన్‌తో యాక్షన్ ఎపిసోడ్లో అదరగొట్టాడు. పవన్ అభిమానులే కాదు.. మాస్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటాయి. విపరీతమైన ఎలివేషన్స్ సినిమాల్లో పవన్ ఎంట్రీని హైలెట్ చేశాయి. అయితే.. సినిమాకు మెయిన్ హైలెట్ మాత్రం ఇంటర్వెల్ ఎపిసోడ్ అనే చెప్పాలి. ఈ ఎలివేషన్స్ సీన్లు కొత్తవి కాదు. ఇప్పటివరకు చూడని సీన్స్ కూడా కాదు కానీ.. మాస్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ముగ్గురి కష్టం ఈ సీన్లో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది.
ది బెస్ట్ ఇచ్చారు అనే ఫీల్ ఆడియన్స్‌లో కలుగుతుంది.. ఇక ఇంటర్ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ మిగతా భాగం కూడా బానే ఉంది. ఫస్ట్ టీజర్, గ్లింప్స్‌లో చూపించిన పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాలో నెక్స్ట్ హైలెట్. డైరెక్టర్‌గా ఈ సీన్స్‌లో సుజిత్ పనితనం కనిపించింది. ఈ సీన్ ఆడియన్స్‌ను కన్విన్స్ చేసేలా డిజైన్ చేశాడు సుజిత్. తర్వాత కూడా.. కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. సినిమా నెక్స్ట్ లెవెల్లో టాక్ దక్కించుకునేది. ముంబైకి తిరిగి వచ్చాక ఏం చేశాడనే విషయంలో పెద్దగా సర్ప్రైజ్ లేకపోవడం.. విలన్, హీరో ఒకరిని ఒకరు ఓడించుకోవడానికి వేసే స్ట్రాటజీలు ఆకట్టుకోలేకపోయాయి.
సినిమా చూస్తున్నంత సేపు కేవలం పవన్ ను ఎలివేట్ చేయడమే లక్ష్యంగా సాగినట్లు అనిపిస్తుంది. దీంతో మెల్లమెల్లగా సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. ఇక హీరోకి తగ్గ రేంజ్లో బలమైన పాత్ర విలన్‌కు పడలేదన్న ఫీల్ కలుగుతుంది. కథలో.. ఏదైనా గొప్ప టేస్ట్ ఉంటే సినిమాపై హైప్ ఉండేదేమో.. ఈ క్రమంలోనే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని వెళ్లే ఆడియన్స్‌కు మాత్రం.. కాస్త నిరాశ తప్పదు. సినిమాను నిలబెట్టే అంత డ్రామా సెకండ్ హాఫ్‌లో లేదు. సినిమాకు వచ్చిన హైప్‌ను టచ్ చేసేంత వెయిట్ కంటెంట్ లో కనిపించలేదు. క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. ఎపిసోడ్ మొత్తం పెద్దగా పేలలేదు. ఓవరాల్ గా పవన్ ఆరాధించే ఫ్యాన్స్ థియేటర్లో కనువిందు చేసుకునే సినిమా.. ఎలివేషన్, యాక్షన్ సీన్స్ లకు కొదవలేదు. కానీ అంతకంటే ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసే సాధారణ ఆడియన్స్ కు మాత్రం నిరాశ తప్పదు.
నటీనటుల పర్ఫామెన్స్:
పవన్ కెరీర్లోనే ఓజీ.. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఓజెస్ గంభీర్ రోల్లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్. వీరమల్లు మాదిరి దాగుడుమూతలు కనిపించలేదు. యాక్షన్ ఘట్టాలని.. చాలా నేచురల్‌గా తీశారు. పవన్ ఎఫర్ట్స్ క్లియర్‌గా అర్థమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ సీన్స్‌తో సహా.. అన్ని ఎపిసోడ్స్‌లో పవన్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. తన ఫ్యాన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారో.. అది పవన్ ఈ సినిమాతో తీర్చేసాడు. ప్రియాంక అరుళ్ మోహన్.. తన పాత్ర నడివిలో ఆకట్టుకుంది.
పవన్ తో ఆమె జోడి సెట్ అవుతుందా.. అనే డౌట్ కు క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది. రోల్స్పేస్ తక్కువైనా.. తన రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ఇమ్రాన్ హష్మి.. విలన్ రోల్లో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. కానీ.. హీరోతో తలపడే విలన్ పాత్రకు ఉండే వెయిట్ కనిపించలేదు. మొదట్లో ఓవర్ బిల్డప్ ఇచ్చినా.. తర్వాత ఆ రేంజ్ స్ట్రెంత్ కనిపించలేదు. ప్రకాష్ రాజ్.. సత్యా దాదాగా ఆకట్టుకున్నాడు. అర్జున్ దాస్ రోల్ ఆడియన్స్‌కు డిసపాయింట్మెంట్ కనిపిస్తుంది. సినిమాలోని ఆయన రోల్ కు పెద్దగా ఇంపార్టెన్స్ అనిపించలేదు. గీత పాత్రలో శ్రీయ రెడ్డి మెప్పిస్తుంది. కనిపించిన ప్రతి సీన్లోను హైలెట్‌గా మారింది. ఇక మిగతా నటులంతా తమ పాత్రకి తగ్గట్టు మెప్పించారు.
టెక్నికల్ గా:
సినిమాకు.. స్క్రీన్ పై హీరో పవన్ అయితే.. బ్యాక్ గ్రౌండ్ హీరో థమన్ అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు జైలర్లు, లియో లాంటి సినిమాలకు తన ఓజీ సినిమానే బెస్ట్ ఆన్సర్ అంటూ అంత ధీమాగా థమన్ ఎందుకు చెప్పాడో.. థియేలర్స్లో అడుగుపెట్టిన ఆడియన్స్ కు క్లియర్ గా అర్థమైపోతుంది. బ్యాక్ గ్రౌండ్ తోనే తన ఉనికిని చాటుకున్నాడు. సినిమాకు థమన్ మ్యూజిక్ బెస్ట్ హైలెట్. పవన్ ప్రతి సీన్‌కు ఎలివేషన్స్ ఆ రేంజ్ లో ఇచ్చారు. ఇక రవితేజ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్స్ సూపర్. సుజిత్ టేస్ట్‌కు తగ్గట్టు.. స్టైలిష్ విజువల్స్ తో సినిమాకు రవిచంద్ర మంచి లుక్ అందించాడు. నిర్మాణ విలువలు చాలా నాణ్యంగా ఉన్నాయి. ఇక డైరెక్టర్.. తన అభిమాన హీరోని.. అనుకున్నట్లుగా స్టైలిష్ లుక్ లో ఎలివేషన్స్‌తో చక్కగా చూపించాడు. ఇందులో సక్సెస్ అయిన సుజిత్.. స్టోరీ పై కూడా కాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. టేకింగ్ బాగున్నా కథలో కొత్తదనం చూపించలేకపోయాడు. కథనం కూడా ఊహించిన రేంజ్లో ఉంటే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనడంలో సందేహం లేదు.
ఫైనల్ గా: పీక్స్ లెవెల్ ఎలివేషన్‌తో అదరగొట్టి.. వీక్ ఎగ్జిక్యూషన్‌తో నిరాశపరిచారు.
రేటింగ్: 3/5