మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!

దర్శకధీరుడు రాజమౌళి తర్వాత.. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు ఎవరు అంటే టక్కున అనిల్ రావిపూడి పేరే గుర్తొస్తుంది. పాన్ ఇండియాలో ఆయన ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా.. ప్రాంతీయ భాషలోనే తనదైన స్టైల్‌లో సినిమాలు తీస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా.. ఆయన తెర‌కెక్కించే ప్రతి సినిమా మిడిల్ క్లాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తూ ఉంటాడు. తను పెట్టిన ప్రతి ఒక్క రూపాయి రిటన్ బ్యాక్ అయ్యేలా కథ‌ డిజైన్ చేస్తాడు. ప్రతి డైలాగ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని మెప్పించేలా రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలోని తాను తెర‌కెక్కించిన సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకోవడమే కాదు.. సినిమాల్లో వచ్చే కొన్ని డైలాగ్ లు కూడా ఎక్కువగా గుర్తుండిపోతాయి.

ఇక చివరిగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విక్టరీ వెంకటేష్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసింది. వెంకీ కెరీర్‌లోనే హైయ‌స్ట్ క‌లెక్ష‌న్స్ కొట్టిన‌బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అనీల్‌ ఎప్పుడైతే మెగాస్టార్ తో నెక్స్ట్ మూవీ చేస్తున్నాడ‌ని తెలిసిందో అప్ప‌టినించే ఈ సినిమా ఫ్యాన్స్ అంచ‌నాలు ఆకాశానికి అంటాయి. అనిల్ ఎప్పటినుంచో మెగాస్టార్ తో సినిమా తీయాలని కలలు కంటున్నారు. ఎట్టకేలకు ఆయన కల నెర‌వ‌రేంది. ఇప్పటికే సినిమా 40% పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. నేడు మెగాస్టార్ 70వ‌ పుట్టినరోజు సందర్భంగా అనీల్‌ ఈ సినిమా గ్లింన్స్‌ రిలీజ్ చేశారు. ఈ వీడియో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.

బాస్ ఇజ్ క‌మింగ్ అంటూ.. అభిమానులు చిరుని ఎలా చూడాలనుకుంటున్నారో అంతే పర్ఫెక్ట్ గా అనిల్ చూపించారు. చిరంజీవి సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకొనున్నారని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన టీం.. చిరు లుక్‌తో ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొల్పారు. కాగా.. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ అభిమానలతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమాల్లో వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించ‌నున్నాడ‌ని.. రోల్‌ అద్భుతంగా ఉంటుందంటూ వివరించాడు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం లో నాటి క్యారెక్టర్లోనే కనిపించనున్నాడంటూ.. న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక చిరు టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌కు వాయిస్ ఇవ్వమని వెంకటేష్ అడగగానే వెంటనే ఓకే చెప్పేసారని అనిల్ రావిపూడి వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేసామని.. త్వరలోనే ఆయన సెట్స్‌లో సందడి చేయనున్నాడు అంటూ వివరించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ విజిల్స్‌తో ఈవెంట్ మోత‌మోగిపోయింది. చిరంజీవి వెంకటేష్ గారిని ఒకే స్క్రీన్ పై చూడబోతున్నామని ఆనందం ఫ్యాన్స్ లో మరింత పెరిగింది.