టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజుల విరామం తర్వాత.. పవన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నాడు పవన్. ఇక ఈ మూవీ ఆయన కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా రూపొందుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెలకొన్న క్రమంలోనే.. సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే.. మేకర్స్ సైతం తాజాగా సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే.. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే రెండు నెలల ముందు సినిమాకు సంబంధించిన ప్రచారాలు మొదలైపోతాయి. కానీ వీరమల్లు సినిమాకు మాత్రం ఇంకా 20 రోజుల కూడా టైం లేకున్నా.. ఇప్పటికీ ప్రమోషన్స్ పై క్లారిటీ లేదు. ఈ సినిమా జులై 24న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సాలిడ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 19న గ్రాండ్గా తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారట. లాస్ట్ టైం కూడా ఇక్కడే అనౌన్స్ చేసి ఫ్రీ రిలీజ్ వాయిదా పడినా.. ఈసారి మాత్రం అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదంటూ టాక్ నడుస్తుంది. ఇక దీనిపై అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాను.. జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్తంగా రూపొందించారు. కీరవాణి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం విశేషం.