వెంకీ – బాలయ్య కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టార‌ర్‌.. డైరెక్టర్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మల్టీ స్టారర్‌ సినిమాలు ఇప్పుడే కాదు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు జనరేషన్ నుంచే ఎంతో ఆదరణ పొందాయి. తర్వాత కొంతకాలం ఈ మల్టీ స్టార‌ర్ సినిమాల హవా తగ్గిన.. చిరంజీవి – బాలయ్య, నాగార్జున – వెంకటేష్ కాంబోలో కూడా అడపాదడపా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక ఆడియన్స్ సైతం మల్టీ స్టార‌ర్ సినిమాలకు మాకువ‌ చూపుతూ ఉంటారు. తమ అభిమాన హీరోలు ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. మంచి కథలు వస్తే స్టార్ హీరోలు సైతం కలిసి నటించడానికి ప్రయత్నాలు చేస్తారు.

అలా ఇప్పటికే చాలా మల్టీ స్టారర్‌ సినిమాలు వ‌చ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా లెవెల్ లోను ఆర్‌ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ మల్టీస్టార‌ర్ వ‌చ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ట్రెండ్ సరికొత్తగా మొదలైంది. ఇలాంటి క్రమంలో.. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న సినిమాల్లో విక్టరీ వెంకటేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే,

Balakrishna - Gopichand Malineni Combo Locked - TrackTollywood

ఇక తాజాగా.. ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు వెంకీ. ఇటీవల జరిగిన నాట్స్ 2025 ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ మెగ 157 పై క్లారిటీ ఇవ్వడమే కాదు.. మరో ఉత్సాహపరిచే అప్డేట్‌ను పంచుకున్నాడు. త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో పెద్ద స్టార్ హీరో.. నా ఫ్రెండ్ సినిమాలో కలిసి నటించబోతున్నానని చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ హీరో పేరు వెంకటేష్ రివీల్ చేయకపోయినా.. అది నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ సినిమానే అంటూ టాక్ గట్టిగా వైరల్ అవుతుంది. బాలయ్య, గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాల్లో వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర కోసం అప్రోచ్‌ అయ్యారని.. వెంకటేష్ సైతం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.