రష్మిక మందన పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత తీరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక.. ఇప్పుడు తన సినిమా విషయంలో సెన్సేషనల్ డిసిషన్ తీసుకుందంటూ వార్త వైరల్‌గా మారుతుంది. కచ్చితంగా ఇది ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ అనడంలో అతిశయోక్తి లేదు. అసలు మ్యయాటర్ ఏంటంటే.. రష్మిక మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుందంటూ టాక్ గత కొద్ది రోజులుగా తెగ వైరల్‌గా మారుతుంది. అట్లీ డైరెక్షన్‌లో భారీ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందుతున్న అల్లు అర్జున్ సినిమాల్లో.. రష్మిక మందన కూడా ఓ హీరోయిన్గా మెరువనుందట.
ఈ సినిమా కోసం హీరోయిన్ల అవకాశముండగా.. ఒక పాత్రలో దీపిక పద్దుకొనే.. మరో పాత్రలో మృణాల్ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మూడో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన ఎంపిక అయిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. దీపికకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చిరా.. మృణాల్, రష్మికులకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే టీం వెల్లడించలేదు. కానీ.. ప్రస్తుతం సినిమా షూట్ ముంబైలో గ్రాండ్గా జరుగుతుండగా.. ఈ షూట్లో మృణాల్ ఠాగూర్ పాల్గొంటున్నారు. ఇక మూడో హీరోయిన్ పాత్రలో రష్మిక మందన దాదాపు ఫిక్స్ అయిపోయిందని సమాచారం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన ఎప్పుడూ నటించే రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కాకుండా.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో మెరవనుందట.
కొన్ని యాక్షన్ సీక్వెన్స్లతో కూడా అమ్మడు కనిపించనుందని టాక్. ఇక ఆ యాక్షన్స్ సన్నివేశాల కోసం.. ఆమె స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని తెలుస్తుంది. వీటిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు గ్లామర్ పాత్రలో.. పాజిటివ్ షేడ్స్‌లో మెరుపులు మెరిపిస్తూ.. కుర్రకారును కవ్వించిన రష్మిక.. ఒక్కసారిగా విలన్ గా నెగటివ్ షేడ్స్.. యాక్షన్ సీన్స్ లో నటించడం అంటే అది బిగ్ షాక్ అని చెప్పాలి. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా 2027 లో రిలీజ్ కానుంది.