ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు నెటింట హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా విడాకులు తీసుకుంటున్నారో.. ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే రోజుకో సెలబ్రిటీ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పెద్ద సంచలనంగా మారింది.
ఓ తెలివితక్కువ వ్యక్తిని వివాహం చేసుకుంటే.. ఆ పెళ్లి ఓ పెద్ద తప్పే అవుతుంది. భర్త చేసే తప్పులకు.. భార్య బాధ్యత వహించాల్సి వస్తుంది.. మగాళ్లు సహజంగానే ఇన్ మెచ్యూర్డ్‌గా ఉంటారు. ఒంటరిగా నన్ను వదిలేయండి.. నేను చాలా అనుభవించా అంటూ ఆమె ఓ పోస్ట్ ని షేర్ చేసుకుంది. అది సోషల్ మీడియాలో దుమారంగా మారింది. నయనతార పోస్ట్ క్షణాల్లో రిమూవ్ చేసిన.. స్క్రీన్‌షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ పోస్ట్ తో నయనతార, విగ్నేష్ శివన్ మధ్య విభేదాలు మొదలయ్యాయని ఊహాగానాలు వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరు విడిపోతున్నారని త్వరలోనే డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ రకరకాల గుసగుసలు మోగిపోయాయి.
ఇటీవల ఈ జంట మధ్య ఎప్పటికప్పుడు దూరం కనిపిస్తూనే ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. వార్తలు మొదలైన కొద్ది గంటలకే నయనతార తన భర్త పిల్లలతో కలిసి పాలాణి స్వామి ఆలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సాష్టాంగ నమస్కారాలను సైతం చేసింది. భార్యభర్తలిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించడంతో వాళ్ల డివోర్స్ వార్తలకు చెక్ పడింది. ఇక నయనతార ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమా షూట్‌లలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.