చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్.. స్క్రిప్ట్, టైటిల్ కూడా ఫిక్స్.. మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సైతం నెక్స్‌ట్ జ‌న‌రేష‌న్ హీరోలతో మల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. అంతేకాదు.. తమ తోటి హీరోలతో సైతం మల్టీ స్టార‌ర్ సినిమాలు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెర‌కెక్క‌నున్న‌ సినిమాల్లో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్లో మెరవనున్నాడు. అంతేకాదు.. నందమూరి బాలయ్య సినిమాలను వెంకటేష్ నటించనున్న‌ట్లు చెప్పక‌నే చెప్పేసాడు.

K Raghavendra Rao

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ స్టార్ హీరోలను మల్టీస్టారర్ సినిమాల్లో చూసే అవకాశం ఆడియన్స్ కు ద‌క్క‌నుంది. అయితే.. ఇప్పుడే కాదు.. గతంలోని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు ప్లాన్ చేశారట. అంతేకాదు.. ఆయన సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసి టైటిల్ ని కూడా ఫిక్స్ చేసిన తర్వాత సినిమా ఆగిపోయిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు రాఘవేంద్రరావు. ఇంద్ర సినిమా తర్వాత చిరంజీవి.. రాఘవేంద్ర రావు కాంబోలో ఒక సినిమా తెర‌కెక్క‌నున్నట్లు వార్తలు వైర‌ల్ అయ్యాయి. చిన్నికృష్ణ ఆ ముగ్గురు హీరోల మల్టీ స్టార‌ర్ కోసం కథను కూడా పూర్తి చేశాడు.

Venkatesh at Venky 75 event: Had it not been for Chiranjeevi, I would have  gone to the Himalayas - Hindustan Times

ముగ్గురు స్టార్ల కలయిక కావడంతో.. ” త్రివేణి సంగమం ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రామానాయుడు, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్‌ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. అయితే కథ ఓకే అయినా ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్ తో.. ఇంట్రడక్షన్ సీన్స్ రాసేందుకు చాలా సమయం తీసుకోవాల్సి వచ్చిందట. ముగ్గురు హీరోల అభిమానులను మెప్పించాలి.. ఇంట్రడక్షన్ సీన్స్ రాయడంలో విఫలం కాకూడదని యూనిట్ ఎంత ప్రయత్నించినా అది ఫలించలేదు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకుండా ఆగిపోయింది. దీంతో రాఘ‌వేంద్ర‌రావు 100వ సినిమాగా చిరంజీవి తనయుడు చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. కానీ.. చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా లేనని చెప్పేయడంతో అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేశారు. అలా రాఘవేంద్ర వంద సినిమా గంగోత్రి.. వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.