టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అరడజన్కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక.. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో సర్దార్, కల్కి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక.. ప్రస్తుతం ప్రభాస్‌కు రాజాసాబ్, హనురాగవపూడి ఫౌజి, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్నీ రిలీజై మంచి సక్సెస్ అందుకుంటే.. ప్రభాస్ మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. కాగా ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది.
తర్వాత అందాల రాక్షసి సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన హనురాగవపూడితో మరో సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫౌజి రన్నింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ క్రమంలోని వీళ్ళిద్దరి కాంబోలో సినిమా పై ఆడియన్స్‌లో హైప్ మొదలైంది. మరి ఈ కాంబో ఓలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి. ప్రభాస్ స్పిరిట్ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో తెలియదు కానీ.. తాజాగా కల్కి 2పై మాత్రం ప్రొడ్యూసర్ క్రేజీ అప్డేట్స్ ను రివిల్ చేశారు. ప్రభాస్ కెరీర్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచిన కల్కి.. నాగ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు.. బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమలహాసన్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలకపాత్రలో మెరిశారు. కల్కి సాధించిన ఈ గ్రాండ్ సక్సెస్ తో అందరి దృష్టి కల్కి 2 పై పడింది. ప్రభాస్ అభిమానులంతా కల్కి 2 కోసం కళ్ళు కాయలు కాచలైతే చూస్తున్నారు. తాజాగా కల్కి సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కల్కి 2 పై నిర్మాత అశ్విని దత్త్ అప్డేట్ ఇచ్చేశాడు.ఆయన మాట్లాడుతూ కల్కి 2 షూట్ సెప్టెంబర్ లో ప్రారంభమవుతుందని.. వచ్చే సంవత్సరం మే, జూన్‌లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌కు కనువిందు చేసే సినిమా రూపొందనుందని.. ఆయన చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో మరింత హైప్ ను పెంచాయి. ప్రొడ్యూసర్ కామెంట్స్ పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.