టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దేవరతో చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2, అలాగే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ కానుండగా.. వచ్చేఏడాది జూన్‌లో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమాలో తర్వాత.. జైలర్ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్‌లో తారక్.. మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమానే కాకుండా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సైతం తారక్ మరో సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇక.. నెల్సన్ – తారక్ కాంబో మూవీ.. 2027 సంక్రాంతిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. దీని తర్వాత త్రివిక్రమ్ తో మైథాలజికల్ మూవీ ఉంటుందని.. దీని 2028 నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ నడుస్తుంది.
ఇన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల మధ్యలో.. క్రేజి లైనప్‌తో దూసుకుపోతున్న తారక్.. ఈ సినిమాలతో మంచి సక్సస్ అందుకుంటే ఆయన మార్కెట్ మరింతగా పెరిగిపోతుందనటంలో సందేహవం లేదు. ఈ క్రమంలోనే.. ఈ స్టార్ డైరెక్టర్ల సినిమాల తర్వాతైనా.. ఇన్ కంప్లీట్ గా ఆపేసిన దేవర పార్ట్ 2ను తారక్ పూర్తి చేస్తాడా.. లేదా.. కొరటాల శివ దేవర ఋణన్ని తీర్చుకుంటాడో.. లేదో.. అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. దీనికి క్లారిటీ రావాలంటే మేకర్స్ అఫీషియల్ గా రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.