ఆ మూవీలపై హైప్‌ పెంచేస్తున్న నాగవంశీ .. ఈ మాత్రం కిక్కిస్తే చాలు అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ‌ వంశీ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా కనిపిస్తారు .. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తారు .. అయితే ఈ క్రమంలోనే ఆయన వేసే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతాయి .. తాజా నాగవంశీ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ అండ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ..

కింగ్డమ్ గురించి ఆయన పోస్ట్ పెడుతూ . నేను గట్టిగా నమ్మితే గాని ఏది కరెక్ట్ గా చెప్పను .. ఎందుకంటే అది కొంచెం తేడా కొట్టిన మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు .. కానీ ఈ సినిమా చూసి చెబుతున్న .. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పక్క ఎంటర్టైనర్ .. గౌతమ్ స్టైల్లో త్వరలోనే అదిరిపోయే టీజర్ , సాంగ్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అందిస్తామంటూ పోస్ట్ పెట్టాడు .

Kingdom: 'కింగ్‌డమ్' చిత్రం నుండి మొదటి గీతం 'హృదయం లోపల' విడుదల - Latest  Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

అలాగే పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు గురించి కూడా ఓ పోస్ట్ పెట్టాడు నాగ వంశీ .. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ రాబోతుందనే విషయాన్ని చెప్పేశాడు .. అలాగే ఈ ట్రైలర్ నాగ వంశీ చూశారట.. ట్రైలర్ తో వీరమల్లు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తాడు .. ట్రైలర్ తర్వాత సినిమా గురించి అందరూ మరింత మాట్లాడుకుంటారు అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు .. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారగా .. అభిమానులకు మాత్రం భారీ బూస్ట్ ఇస్తూ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు .