ఇండస్ట్రీలో సెన్సేషనల్ కపుల్ పవిత్ర లోకేష్, నరేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్.. పవిత్రను నాలుగో వివాహం చేసుకోగా.. పవిత్ర నరేష్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా పవిత్ర లోకేష్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. నరేష్ పని అయిపోయిందని.. పవిత్ర లోకేష్.. నరేష్‌ను కూడా వదిలేసిందంటూ.. మరో స్టార్ హీరో మాయలో పడిపోయింది అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ పవిత్ర లోకేష్ ఏం చేసింది.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. గత మూడేళ్ల క్రితం నరేష్. పవిత్ర లోకేష్‌ల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిందే.
డిజిటల్ మీడియా, మెయిన్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వీరు ఇద్దరి గురించి వార్తలు వినిపించేవి. ఇలాంటి క్రమంలో తాజాగా పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు నరేష్ కంటే ముందే మరో స్టార్ హీరో అంటే ఇష్టమని.. అతనే నా క్రష్, లవ్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అమ్మ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంతకీ నరేష్ కంటే పవిత్ర లోకేష్‌కు అంతగా నచ్చిన హీరో మరెవరో కాదు నాగార్జున. చిన్నప్పటి నుంచి పవిత్ర లోకేష్ నాగార్జునని ఎంతగానో ఇష్టపడేదట. తన ఫస్ట్ క్రష్ నాగార్జున అని చెప్పుకొచ్చిన పవిత్ర లోకేష్.. నరేష్ ప్రేమించే కంటే ముందే నాగార్జునను చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగేవో.. ప్రకాష్ రాజ్‌ని చూసిన కూడా అలాంటి ఫీలింగ్స్ కలిగేవంటూ వివరించింది.
ప్రకాష్ రాజ్ కూడా తనకు చాలా ఇష్టం అంటూ పవిత్ర లోకేష్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక పవిత్ర లోకేష్ మాటలు ప్రస్తుతం నెటింట తెగ వైరల్ గా మారడంతో పవిత్ర నిజంగా పెద్ద కిలాడి.. నరేష్ ని పక్కన పెట్టి నా ఫస్ట్ క్రష్ నాగార్జున అంటూ ఓపెన్ గా ఇలాంటి కామెంట్స్ చేయడమేంటి.. హీరో కాబట్టి అందరికీ క్రష్ ఉంది కానీ.. ప్రకాష్ రాజ్ పై కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఉండేవని చెప్పడంలో అర్థమేంటి అంటూ మండి పడుతున్నారు. అంతేకాదు.. నువ్వు నరేష్ ని కూడా మధ్యలోనే వదిలేస్తావు.. అలాంటి దానివే నువ్వు అంటూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా పవిత్ర.. నరేష్ కంటే ముందే ఆ ఇద్దరు నటులంటే ఇష్టమని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.