ఇంట్ర‌స్టింగ్‌: బ‌న్నీ – అట్లీ మూవీ టైటాల్.. బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జవాన్‌తో సంచ‌ల‌నం సృష్టించిన అట్లీ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి రూపొందించిన భారీ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన మూవీ టీం.. త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను హైదరాబాద్‌లో కలిసిన బన్నీ.. సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు ప్రారంభించారు. సన్ పిక్చర్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనుంది.

Allu Arjun's big input for ICON!

త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను టీం అఫీషియల్ గా ప్రకటించనున్నారు. అయితే.. తాజాగా సినిమా టైటిల్ గురించి ఓ న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. బన్నీ, అట్లీ సినిమాకు రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటిది సూపర్ హీరో కాగా.. మరొకటి ఐకాన్. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసే సినిమాకు ఫిక్స్ చేయనున్నారట. గతంలో డైరెక్టర్ శ్రీరామ్.. అల్లు అర్జున్తో సినిమా తెరకెక్కించాలని భావించాడు. దానికి ఐకాన్ టైటిల్ ఆయన ఫిక్స్ అయ్యారు. అయితే.. ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాలేదు.

ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ సినిమాకు ఐకాన్ టైటిల్ అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. అట్లీకి కూడా ఈ టైటిల్ న‌చ్చ‌డంతో దాదాపు ఇదే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు టాక్. ప్రతి సినిమాకు కొత్త లుక్ తో అభిమానులను అలరించే బన్నీ.. పుష్పా సినిమాతో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్ లో మెప్పించాడు. అలాంటి బ‌న్నీ.. ఇప్పుడు మరోసారి అట్లీ సినిమా కోసం సరికొత్తగా లుక్‌ను మార్చుకోనున్నాడట‌. కథ‌కు తగ్గట్టుగా.. భిన్నమైన గెటప్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్ట్‌తో.. సైన్స్ ఫ్రిక్షన్ బాక్‌ డ్రాప్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓ కొత్త ప్రపంచాన్ని డిజైన్ చేసే పనిలో మూవీ టీం బిజీ బిజీగా ఉన్నారు. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ విఎఫ్‌ఎక్స్ సంస్థ ఇప్పటికే సినిమా కోసం రంగంలోకి దిగింది.