బన్నీ సినిమాలో హీరోయిన్ గా ఆ ముదురు బ్యూటీ.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత ఏ ప్రాజెక్టులో నటించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ఆల్మోస్ట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లితో సినిమా ఫిక్స్ అయిందని వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్ తో కూడా బన్నీ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలను బట్టి బన్నీ.. అట్లీ, త్రివిక్రమ్ ఇద్దరు సినిమాల షూటింగ్ లు సమాంతరంగా చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా కంటే ముందు అట్టి సినిమానే సెట్ పైకి రానుందట. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడని.. ఒకటి పాజిటివ్ రోల్ కాగా, ఒకటి నెగటివ్ రోల్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఒకవేళ బన్నీ ఒప్పుకొని నిజంగానే డ్యూయల్ రోల్ లో రెండు షేడ్స్ లో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తాడు అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలో సినిమా హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు వెళ్లి స్టార్ గా ఎదిగి.. గ్లోబ‌ల్ ఇమేజ్‌ దక్కించుకున్న ప్రియాంక చోప్రాను సినిమాలో హీరోయిన్గా భావిస్తున్నారని టాక్. ఈ క్ర‌మంలోనే ఒకవేళ ఇదే వాస్తవం అయితే వెంటనే మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకోవాలని మండిపడుతున్నారు.

Everything to Know About Priyanka Chopra's Life and Career - Business  Insider

వయసు విషయంలో బన్నీ, ప్రియాంక చోప్రా సమానమైన.. బ‌న్నీ లుక్స్ ప్రస్తుతం కుర్రాడిగా ఉన్నాయ‌ని.. ప్రియాంక చోప్రా ముదురు బ్యూటీల అనిపిస్తుందని.. వీరిద్దరి పెయిర్ అసలు సెట్ కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా.. సినిమా రిజల్ట్ లో అవకతవకలు వచ్చేస్తాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ప్రియాంక చోప్రా ఇప్పటికే రాజమౌళి, మహేష్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సినిమా షూట్స్ లో వరుసగా పాల్గొంటుంది. ఇక రాజమౌళితో సినిమా అంటే రెండు నెలల వరకు మరో సినిమా చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే బన్నీ సినిమాలో ప్రియాంక హీరోయిన్ అయ్యే అవకాశం లేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా రాజమౌళి షరతులు వర్తిస్తాయా లేదా తెలియాలి.