2025: నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న టాప్ 10 ఇండియ‌న్‌ సినిమాల లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం ఓటిటి యుగం కొనసాగుతుంది. బడ్జెట్ ఎంతైనా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. నెల‌తిరిగేసరికి.. ఓటీటీ ప్లాట్ఫారంలో ప్రత్యక్షమవుతుంది. ఈ క్రమంలోని ఆడియన్స్ సైతం ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూసుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ను పెంచుకుంటూ.. సినిమాల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాదిలో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్ ఫామ్‌లో తెలుగు సినిమాలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి.

Pushpa Raj Coming For Daku Maharaj? | Pushpa Raj Coming For Daku Maharaj?

అలా.. ఇప్పటివరకు హైయెస్ట్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్న పాన్ ఇండియా టాప్ టెన్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమాల్లో పుష్ప పార్ట్ 2.. రెండ‌వ‌ స్థానాన్ని ద‌క్కించుకుంది. బాలీవుడ్ ధూమ్ దాం మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో 12.4 మిలియన్ వ్యూస్‌తో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తుండగా.. తెలుగు సినిమా అయినా పుష్ప పార్ట్ 2.. 9.4 వ్యూస్ సాధించి 2వ‌ స్థానాన్ని దక్కించుకుంది. ఇక నడివియాన్ మూవీ 8.3 మిలియ‌న్ వ్యూస్‌తో మూడవ‌ స్థానంలో.. భూల్ బులాయా 3 మూవీ 5.6 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో రాణిస్తున్నాయి.

ఇక నందమూరి నట‌సింహం బాలయ్య.. డాకు మహారాజ్ 5 మిలియన్ వ్యూస్‌ దక్కించుకొని హైయెస్ట్ వ్యూస్‌ సాధించిన టాప్ 5 సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆఫీసర్ ఆన్ డ్యూటీ 4.7 మిలియన్ వ్యూస్‌తో 6వ‌ స్థానంలో.. డ్రాగన్ మూవీ 4.7 మిలియన్స్ వ్యూస్‌తో 7వ స్థానంలో నిలిచాయి. ఇక విడముయార్చి 4.3 మిలియన్ వ్యూస్ సాధించి 8వ స్థానాన్ని దక్కించుకుంది. ఎమర్జెన్సీ 3.3 మిలియన్ వ్యూస్‌తో 9వ స్థానంలో.. ఆజాద్ 2.9 మిలియన్ వ్యూస్‌తో పదవ స్థానంలో నిలిచాయి.