SSMB 29: ఫ్యాన్స్‌కు బిగ్‌ అలర్ట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ముహూర్తం పిక్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ప్రారంభమై చాలా రోజులైంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కూడా టీం పూర్తి చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక మూడో స్కెట్లను మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నడట జక్కన్న. ఈ క్రమంలోనే మహేష్ మరే పని లేకుండా కేవలం జ‌క్క‌న సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా మహేష్ ఫ్యాన్స్‌తో పాటు.. ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఒక్క ఫోటో అయినా రిలీజ్ చేస్తే బాగుండని ఆశపడుతున్నారు.

SSMB 29🦁❤️‍🔥 → @urstrulymahesh 🦁💥, @ssrajamouli 🔥, Jan 2025 shoot  Begins ❤️‍🔥❤️‍🔥❤️‍🔥, Jai Super ⭐ Mahesh Babu 🔥, Jai Babu ❤️‍🔥,  #maheshbabu😎 #maheshbabughattamaneni #maheshbabufansclub #maheshbabu ...

అయితే జక్కన్న ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. తాను ఏం చేసినా ప్రపంచమంతా చూసేలా డిజైన్ చేస్తాడు. అందుకే ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ లుక్ కోసం కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ముఖ్యంగా ఎప్పుడు ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయాలనే దానిపై పెద్ద డిస్కషన్ జరుగుతుందని.. అందులో ఒక డేట్, టీం ఫిక్స్ అయినట్లు సమాచారం. అది కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే ఒక రోజును ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కోసం ఎంచుకున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.

SS Rajamouli, Mahesh Babu's SSMB 29 grand launch on January 2 - India Today

దీంతో టైటిల్ విషయంలో ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా లెవెల్ కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో జక్కన్న సినిమా తీయనున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ రీచ్ అయ్యేలా క్యాచీ టైటిల్ ను పెట్టేలా వేటసాగుతుందట. SSMB 29 ముందుగా గ‌రుడ అని భావించారు. తర్వాత మహారాజ్ టైటిల్ వినిపించింది. మళ్ళీ అందులో కూడా మహేష్ లోని మ‌హ్, రాజమౌళి లోని రాజ్ కలిపి మహ్‌రాజ్ టైటిల్ పెడుతున్నారంటూ టాక్‌ నడిచింది. తాజాగా అందరికీ కనెక్ట్ అయ్యేలా.. జనరేషన్ అనే సింపుల్ టైటిల్ను ప్లాన్ చేస్తున్నారని.. పాన్ వరల్డ్ మూవీ కనుక ఇలాంటి టైటిల్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక మే 31 సూపర్స్టార్ జయంతి సందర్భంగా SSMB 29 ఫస్ట్ లుక్, టైటిల్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట టీం. అంతేకాదు అదే నెలలో మూవీ పై అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నారట.