చిరుతో మూవీపై ఫ్యాన్స్‌కు నాని హామీ.. ఆ ఒక మాటతో అంచనాలను పెంచేసాడుగా..!

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు గ‌ట్టిపోటి ఇస్తూ.. ఇప్పటికి నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యలో పాలిటిక్స్ కోసం సినిమాలకు దూరమైనా మెగాస్టార్.. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇక గతంలో చిరంజీవి నుంచి సినిమా వచ్చిందంటే ఇండస్ట్రీ రికార్డులు బ్లాస్ట్ అవడం పక్క అనేంతలా హైప్ నెలకొనేది. ఇక రిలీజ్ రోజున థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కానీ.. చిరు రీ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన ఒక్క సినిమా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. చిరు ఎనర్జీ మ్యాచ్ చేసే స్టోరీ ఒకటి కూడా ప‌డ‌లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

Chiranjeevi stars in 'most violent film' by Srikanth Odela, Nani to produce

ఈ క్రమంలోనే మెగాస్టార్ తన పంథా మార్చుకొని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు. సరికొత్త స్టోరీలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మల్లిడి వ‌శిష్ట‌ డైరెక్షన్‌లో మెగాస్టార్.. విశ్వంభర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా తర్వాత చిరు.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటించనున్నాడు. ఇక ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైన‌ర్‌గా తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో బిగ్ వైలెన్ సినిమాను చేయనున్నాడు.

Nani Interesting Comments On Chiranjeevi Srikanth Odela Movie - NTV Telugu

ఇక సినిమాకు ప్రొడ్యూసర్గా నాని వ్యవహరించడం మరో విశేషం. ఇక తాజాగా సినిమా పై నాని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివిల్ చేశాడు. చిరు గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని ఓ మార్క్ పడింది. కానీ.. ఆయన అంతకుమించి చిరంజీవి. కేవలం అది మాత్రమే కాదు.. ఆయన్ని ప్రతి ఫ్యామిలీలో ఓ మెంబెర్ గా చూస్తారు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దానిపై ఫోకస్ చేస్తున్నాం. కాగా ప్రస్తుతం శ్రీకాంత్‌తో చేయబోయే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇది నిజంగా నాకు గర్వ కారణం. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారిని పెట్టి ఓ సినిమా తీస్తానని ఎప్పుడు భావించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరింది. నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది చాలా పెద్ద బాధ్యతగా అనుకుంటున్నా. ఫ్యాన్స్ కి ది బెస్ట్ ఇస్తాం. అసలు సినిమాతో డిసప్పాయింట్ చేయమని నాని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం నాని కామెంట్లు వైర‌ల్ అవ్వడంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెల‌కొన్నాయి.