టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సోషియా ఫాంటసీ డ్రామాగా విశ్వంభర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెండు పాటలు మినహ షూట్ మొత్తం పూర్తి చేసిన టీం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. సినిమా సోషియా ఫాంటసీ డ్రామా కావడంతో.. సీజీ వర్క్ పనులు కూడా ఎక్కువగానే ఉన్నాయట. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో పాటు.. హాంగ్‌కాంగ్‌లోను ఈ సినిమా పనులను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ లీక్ ఒకటి వైరల్ గా మారింది.
ఈ సినిమా కోసం చిరు సింగర్ గా మారబోతున్నాడని.. ఓ సాంగ్ పాడనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆ పాటకు చిరంజీవి వాయిస్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించి.. ఆయనతో పాడించాలని ఫిక్స్ అయ్యాడట. చిరంజీవి మొదట నావల్ల కాదని చెప్పేసిన.. కీరవాణి పట్టుబట్టడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి పాడబోయే ఈ సాంగ్ ఏంటో అఫీషియల్ గా ప్రకటిస్తే గాని టింకు క్లారిటీ రాదు. చిరంజీవికి పాటలు పాడటం ఇదే మొదటిసారి కాదు.
ఇప్పటికే కొన్ని సినిమాల్లో గాయకుడుగా గొంతు అందించాడు. మృగరాజు, చూడాలని ఉంది, మాస్టర్ లాంటి సినిమాల్లో పాటలు పాడారు. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ కీరవాణి చొరవతో విశ్వంభర సినిమాలో అలాంటి అవకాశం వచ్చింది. త్వరలోనే చిరును సింగర్ గా చూడబోతున్నారని న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది మెగాస్టార్ మునుపటి కంటే ఇప్పుడు మరింత యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాల్లోనూ చలాకీగా సందడి చేస్తున్నాడు. పనిలోనూ రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. మరి చిరు.. విశ్వంభరలో గాయకుడిగా ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.