సినీ ఇండస్ట్రీలో ఓ పక్క స్టార్ హీరోగా రాణిస్తూనే.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను సినిమాలు తెరకెక్కించి భారీ లాభాలను అందుకుంటున్నాడు నాని. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా కోర్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా వ్యవహరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. ఇక.. నాని హీరోగా నటించిన తాజా మూవీ హిట్ 3. ఈ సినిమాకు తానే ప్రొడ్యూస్ కూడా.
ఇప్పటివరకు కేవలం ఫ్యామిలీ డ్రామాస్, లవ్ స్టోరీలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న నాని.. హిట్ 3తో ఫుల్ ఆఫ్ మాస్, పవర్ ఫుల్ కంటెంట్తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇక.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడది మే 1న ఈ సినిమాను.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన షాకింగ్ ట్విస్ట్ బయటకు రివీల్ అయింది. మొదటినుంచి సినిమాకు కేవలం నాని మాత్రమే హీరో అని అంతా భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాల్లో అడవి శేష్ కూడా మరో ప్రధాన పాత్రలో మెరవనున్నాడట. హిట్ 2 సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిట్ 2 హీరోగా అడవి శేషు నటించారు. ఈ క్రమంలోనే హిట్ 3లోను అడవి శేష్ పాత్ర కంటిన్యూ అవుతుందని.. అంతేకాదు హిట్ 2లో హీరోగా నటించబోయే వ్యక్తి ఎవరో ఈ సినిమా క్లైమాక్స్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక.. సినిమా పార్ట్ 4కు మాస్ మహారాజు రవితేజ లేదా నందమూరి నటసింహం బాలయ్య నటించనున్నారని టాక్.