రజనీ భార్య లత కూడా ఓ సినిమాల్లో నటించిందని తెలుసా.. ఆ మూవీ ఇదే..!

సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ తన యాటిట్యూడ్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్న రజిని.. వరుస సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకుంటూ బిజీగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలీ, జైల‌ర్ 2 సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు రజిని. కాగా.. కూలి సినిమా ఆగష్ట్ 14ను ఆడియన్స్‌ను పలకరించింది. ఇక జైలర్ 2 షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ రెండు సినిమాలకు సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం.

When Rajinikanth shared how his wife, Latha changed him as a man, saying, "When I was a conductor, I'd drink every day..."

ఇదిలా ఉంటే రజినీకాంత్ 1981లో లతాను ప్రేమించి వివాహం చేస్తున్నారు. ఆయన సూపర్ స్టార్ గా బిజీగా గడుపుతున్న క్రమంలో.. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ కాలేజ్ అమ్మాయి లత. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన స్నేహం మొదలైంది.. అది కాస్త ప్రేమగా మారడం తో వివాహం చేసుకున్నారు. పెళ్ళై 44 ఏళ్లయినా ఇప్పటికీ వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇక రజనీకాంత్ సినిమాలోని పాటలను లత పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

కానీ.. ఆమె రజినీకాంత్‌తో కలిసి ఒక సినిమాలో నటించిందన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదు. ఇంతకీ.. రజనీకాంత్ జంటగా లతా నటించిన ఆ సినిమా ఏదో కాదు.. అగ్నిసాక్షి. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బాలచందర్ దర్శకత్వం వ‌హించారు. ఇందులో శివకుమార్, సరిత ప్రధాన పాత్రలో మెరువగా రజనీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. రజిని భార్యగా లతా ఓ సీన్లో మాత్రమే ట‌క్కున మెరిసి మాయ‌మైంది. ఇక తాను నటించిన ఏకైక సినిమా కూడా ఇదే. ఇందులో కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ లో మెరిసాడు.