టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి కాంబోలో క్రేజీ సినిమాకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక క్రేజీ వీడియోతో అఫీషియల్ ప్రకటన ఇచ్చారు టీం. సినిమా అనౌన్స్మెంట్‌తోనే ఓ రేంజ్ లో ఆడియన్స్‌లో హైప్ నెలకొంది. డైరెక్టర్గా అట్లీ ఎక్కువగా మాస్ కథలే రూపొందించారు. కేవలం రాజా రాణి తప్ప.. మిగతా అన్ని సినిమాలు కావడంతో బన్నీ హీరోగా రూపొందునున్న సినిమా కూడా మాస్ కాదే ఉంటుందని అంత అనుకున్నారు.
కానీ.. అమెరికా వెళ్లి మరి పాపులర్ విఎఫ్ెక్స్ సంస్థతో మాట్లాడిన ఈ ఇద్దరు.. హాలీవుడ్ రేంజ్ లో యూనివర్సల్ సినిమాగా.. ఈ సినిమాను రూపొందించనున్నారని క్లారిటీ వచ్చేసింది. ఏకంగా ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసమే రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారట. ఇక మొత్తం సినిమా బడ్జెట్ వేయి కోట్ల వరకు ఉండనుందని తెలుస్తుంది. ఇక సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ డైరెక్టర్ సాయి అభయాంకర్. కేవలం సాయి అభయంకర్ వయసు 20 ఏళ్ల కావడంతో.. ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు.
కానీ బన్నీ, అట్లీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా సాయి అభయాంకర్ దాదాపు ఫిక్స్ అయినట్లే. మ్యూజిక్ ఆల్బమ్‌తో ఈ కుర్రాడు పాపులారిటి దక్కించుకున్నాడు. తమిళ్లో వరుస అవకాశాలు అందుకుంటున్న క్రమంలోనే.. ఈ కుర్రాడికి అనుభవం లేకపోయినా మంచి టాలెంట్ ఉందనే నమ్మకంతో.. అల్లు అర్జున్ ఏకంగా రూ.1000 కోట్ల ప్రాజెక్టులో అవకాశం ఇచ్చేసాడని.. సాయి అభ్యంకర్‌పై బన్నీ పూర్తి నమ్మకం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాయి మరెవరో కాదు.. ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కొడుకు కావడం విశేషం. సింగర్ హరిణి నరసింహనాయుడు, మురారి, ఖుషిలాంటి ఎన్నో సినిమాలకు పాటలు ఆలపించారు.