టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న చరణ్.. నటుడు గానే కాదు.. వ్యక్తిగతంగాను ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక చరణ్ భార్య ఉపాసనకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీళ్లకు క్లీంకార అనే పాప కూడా ఉంది. అయితే వీళ్ళ మధ్యన ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. భార్యాభర్తల బంధం గురించి చరణ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఇందులో భాగంగానే ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లనేది సులువైన పని కాదు.. పెళ్లి జీవితం పూలపాన్పు కాదు. వ్యాపారంలో లానే.. మా బంధానికి మేము త్రైమాసిక సమీక్షలు చేస్తూ ఉంటాం, వ్యక్తిగత, కుటుంబ మరియు వృత్తిపరమైన లక్ష్యాలను ఎస్టిమేట్ చేసుకుంటాం అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. బిజినెస్ లో లాభాలు నష్టాలు పై ఎప్పుడు సమీక్షలు నిర్వహించినట్టే.. కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు వాళ్ల కష్టనష్టాలను ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఒక్కొరికొక్కరు అండగా నిలబడాలని.. ఇలా మాట్లాడుకున్న ప్రతిసారి వాళ్లకు వచ్చిన సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.
దీనివల్ల భార్యాభర్తల బంధం మరింత స్ట్రాంగ్ కావడమే కాదు.. ఒకరిపై మరొకరికి గౌరవం కూడా పెరుగుతుంది అంటూ వివరించింది. దీంతో వాళ్లు ఎంత కాలమైనా కలిసి ఉంటారని చెప్పుకొచ్చింది. అలాగే.. వాళ్ళ పర్సనల్ విషయాన్నీ ప్రస్తావిస్తూ మాకు ఎన్ని పనులు ఉన్నా.. వారంలో ఒక్క రోజైనా సరే కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం.. మా మధ్యన ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా దాని గురించి చర్చించి దాన్ని పరిష్కరించుకుంటాం అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. ఇక చరణ్ చాలా సేఫ్టీ పర్సన్. అలాంటి వాళ్ళు స్త్రీకి పూర్తి మద్దతు ఇవ్వగలరు. మరింత చేయడానికి ప్రోత్సహించగలరు. చరణ్ కూడా ఇప్పుడు నా విషయంలో అదే చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.