స్టార్ట్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీల లిస్టులో అపరిచితుడు ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో విక్రమ్ రామ్, రేమో, అపరిచితుడుగా మూడు వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ సినిమా టీవీలో వస్తే చాలు మంచి టిఆర్పిని సొంతం చేసుకోవడం ఖాయం.
సమాజంలో జరిగే తప్పులకు.. నరకంలో విధించే శిక్షలు అపరిచితుడు బ్రతికుండంగానే విదిస్తాడు. ఇక అప్పట్లో ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ను విపరీతంగా మెప్పించింది. కాగా ఈ సినిమాలో విక్రమ్ చిన్ననాటి రోల్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటాడు. కాగా.. అతను ఓ స్టార్ హీరో బామ్మర్ది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిసి పేరు చెప్పలేదు కదా.. అతనే విరాజ్ అలియాస్ హరి ప్రశాంత్. ఇప్పుడు ఈ చైల్డ్ యాక్టర్ హీరోగా మారి సినిమాల్లోను నటిస్తున్నాడు.
కాగా హరిప్రసాద్ తండ్రి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇళయ దళపతి విజయ్ తల్లి కి ఆయన సోదరుడు. ఈ క్రమంలోనే హరి ప్రశాంత్‌కు విజయ్ దళపతి బావ అవుతాడు. ఇక హరి ప్రశాంత్ ఇప్పటికే నాలుగు ఐదు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసాడు. ఇప్పుడు హీరోగా మారి పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఈయన కీలక పాత్రలో నటించిన మిషన్ చాప్టర్ 1 సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే హీరోగా బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు దక్కించుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.