సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అలా బాలనటులుగా అడుగుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా మారి ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ పై ఫోటోలో మనం శ్రీదేవితో కలిసి చేస్తున్న కుర్రాడు కూడా అదే కోవకు చెందుతాడు. ఇక ఈయన తండ్రి ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. ఇక తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బుడ్డోడు.. మొదటి సినిమాతోనే శ్రీదేవి, రజనీకాంత్ లాంటి దిగ్గజ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేవలం ఒక్క సినిమాలోనే నటించిన ఆయన.. తర్వాత హీరోగా మారి వరుస సినిమా ఆఫర్లను అందుకున్నాడు. తనదైన యాక్టింగ్, డ్యాన్స్ ఫైట్స్‌తో అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల గ్రీకు వీరుడుగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకడు. అంతేకాదు.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోల లిస్టులోను మొదటి వరుసలో ఉంటాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.. సర్లేండి మేమే చెప్పేస్తాం. అతనే బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్.
1986లో నటించిన భగవాన్ దాదా మూవీలో.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా హృతిక్‌రోషన్ మెరిశారు. ఈ సినిమాలో హీరోయిన్గా దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటించి ఆకట్టుకుంది. అదే సినిమాకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో రజినీ, శ్రీదేవి పాటు పలువురు స్టార్ సెలబ్రిటీస్ నటించి ఆకట్టుకున్నారు. కాగా.. ప్రస్తుతం హృతిక్ రోషన్ సినిమాలు పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఫైటర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. వార్ 2 సినిమాతో మరోసారి బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ నెలకొంది.