బాలయ్య మిస్ అయిన ఫస్ట్ 3డి మూవీ అదే.. ఎలా ఆగిపోయిందంటే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. తన సినీ కెరీర్‌లో 109 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య.. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే డబల్ హ్యాట్రిక్ సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం 3డి సినిమాల్లో చాలా కామన్ అయిపోయాయి. కానీ ఏకంగా 40 ఏళ్ల క్రితమే బాలయ్య ఓ 3డి సినిమాకు నాంది పలికాడట. కానీ.. ఆ సినిమా ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అస‌లు ఎలా మిస్ అయిందో ఒకసారి చూద్దాం.

బాలయ్య కెరీర్‌లో చాలా సినిమాలు తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. సాంఘిక, పౌరాణికం, జానపదాలు ఇలా ఎన్నో జానెర్స్ లో బాలయ్య తండ్రి సినిమాల్లో మెరిసాడు. 12వ సినిమా నుంచి ఆయన సోలో హీరోగా మారి రాణిస్తున్నాడు. ఇక 1974 తాతమ్మకల సినిమాతో వెండితెరపై పరిచయమైన బాలయ్యతో.. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ఎస్. గోపాల్ రెడ్డి కలిసి స‌ప‌దం సినిమాను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట. క్రాంతి కుమార్ డైరెక్షన్‌లో కథతో పాటు.. అన్ని సిద్ధం చేసిన టీం సినిమాపై అఫీషియల్‌గా ప్రకటించి త్వరలోనే ప్రారంభించాలని కూడా ప్లాన్ చేసుకున్నారు, కానీ,, ఏం జరిగిందో ఏమో సినిమా మొదట్లోనే ఆగిపోయింది.

Balakrishna : బాలకృష్ణ మొదలుపెట్టాక ఆగిపోయిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలు  ఇవే...

అప్పట్లోనే 3d సినిమాల ట్రెండ్ మొదలవుతున్న క్రమంలోనే,, సపదం సినిమాను కూడా 3డీలో తెర‌కెక్కించాలని టీం భావించారట. కానీ.. సినిమా ఆగిపోయింది. దానికి సంబంధించిన కారణాలు పై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే అప్పట్లో బాలయ్య ఏడాదిలో ఎనిమిది సినిమాల్లో తెర‌కెక్కించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు బాలయ్య ఏడాదికి ఒక్క సినిమాతో వచ్చిన.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా డాకు మహారాజ్‌తో సక్సెస్ అందుకున్న ఆయన.. అఖండ 2 షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడది దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత గోపీచంద్ డైరెక్షన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది.