మహేష్ – జక్కన్న మూవీ కాన్సెప్ట్ అదేనా.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదే..!

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్‌గా రూపొందుతున్న ఇండియన్ మూవీ SSMB29. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. గత రెండు వారాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ ఏడాది జనవరిలో.. సినిమా షూట్ స్టార్ట్ అయిందని సమాచారం. ఇక‌ ప్రస్తుతం ఈ షూటింగ్ను శ‌ర‌వేగంగా కొనసాగిస్తున్నారు. మొదటి స్కెడ్యూల్ పూర్తయిందని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా రెండో స్కేడ్యూల్‌ కోసం ఒడిస్సా వెళ్లారు మూవీ టీం. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా వైరల్ గా మారాయి. ఇలా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో వార్త హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

Mahesh Babu begins SSMB29 shooting in Odisha's Deomali

ఇండియన్ జోన్స్ తరహా మూవీగా సినిమా రూపొందుతుందని స‌మాచారం. అయితే ఈ మూవీలో సైన్స్ ఫ్రిక్షన్ ఎలివేన్స్ ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాక్. దీనికి కారణం సినిమా షూటింగ్ నుంచి లీకైన చిన్న క్లిప్‌. దీంతో ఈ న్యూస్ మరింత ట్రెండ్ అవుతుంది. ఇక సినిమాలో విలన్‌గా పృథ్వీరాజ్ నటిస్తుండగా.. రిలీజ్ అయిన ఆ షార్ట్ క్లిప్‌లో సుకుమార్ వీల్ చైర్ కుర్చీలో కూర్చుంటాడు. అతడి ఎదురుగా మహేష్ బాబు నిలిచి ఉంటాడు. ఇక ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి మహేష్‌ను ముందుకు తోస్తూ తీసుకువెళ్లి పృథ్వీరాజ్ ముందు మోకాళ్ళపై కూర్చో పెడతాడు.

Mahesh Babu - Rajamouli Project: Early Details Are Here! | Mahesh Babu -  Rajamouli Project: Early Details Are Here!

ఈ క్రమంలోనే విలన్ కూర్చున్న ఆ స్పెషల్ కుర్చీ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. సరిగా ఎక్స్ మెన్ సిరీస్ సినిమాలో ఓ వ్యక్తి ఇలాంటి తరహా కుర్చీలోనే కనిపిస్తారు. కేవలం ఆ మూవీలోనే కాదు.. మరి కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ ఇదే తరహా కుర్చీలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కూర్చుని రాజమౌళి విలన్ కోసం వాడాడంటే.. కచ్చితంగా మహేష్ సినిమాల్లో సైన్స్ ఫ్రిక్షన్ టచ్ ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన విషయమే బయటకు చెప్పని రాజమౌళి.. ఇలాంటి కీలక విషయాన్ని అంత త్వరగా రివీల్ చేస్తాడు అనుకోవడం పొరపాటే. ఈ నేపథ్యంలోనే సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నాడు జక్క‌న.. చిన్న విషయం కూడా లీక్ కాకూడదని కఠిన నిబంధనలతో.. జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక సినిమా అంతా పూర్తయిన తర్వాత మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒక అప్డేట్ ఇస్తూ.. ఆడియన్స్‌లో సినిమాపై హైప్‌ పెంచుతాడు.