టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సోషియా ఫాంటసీ.. పిరియాడికల్ మూవీ విశ్వంభర. ఇక ఈ మూవీ పై మొదట్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. గ్రాఫిక్స్ పనితీరులో నాణ్యత లోపించడమే దానికి ప్రధాన కారణం. ఈ క్రమంలోనే గ్లింప్స్ పై ఎన్నో ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇక సినిమా మార్కెటింగ్.. కలెక్షన్ల విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. దీంతో మేకర్స్ మరింత సమయం తీసుకుని విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపరిచే పనిలో బిజీ అయ్యారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మూవీ టీం ఈ సినిమా విఎఫ్ఎక్స్ అంతా రీ క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే విశ్వంభర సినిమా పై ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం మేకర్స్‌కు ఉంది. రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో గ్రాఫిక్స్‌తోనే ప్రేక్షకుడిని ఆకట్టుకోగలిగితే.. ఎలాంటి నెగటివ్ కామెంట్స్ లేకుండా మెప్పించగలిగితే.. ఈ సినిమాకు కచ్చితంగా మంచి హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కోసం మెగా అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
అయితే.. ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట టీం. కాగా ఆగస్టులోనే చిరంజీవి పుట్టినరోజు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు పురస్కరించుకుంటూ ఆ స్పెషల్ డేనే ఆయన సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా.. వర్క్ ప్రోగ్రెస్ ను బట్టి చూస్తే ఇది మాక్సిమం కన్ఫారమ్ అయినట్లే. అదే రోజున లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చిరు అభిమానులు కూడా.. మెగాస్టార్ పుట్టినరోజునే ఈ సినిమా రావాలని కోరుకుంటున్నారు. మరి మేకర్స్.. రిలీజ్ డేట్‌ను ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే మెగాస్టార్ పుట్టినరోజున అనౌన్స్ చేస్తారో.. లేదో.. రాబోయే ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుని.. సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.