టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ట్ దర్శకులుగా తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు అహర్నిసలు శ్రమిస్తున్నారు. రకరకాల కంటెంట్లతో సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకడు. తనదైన స్టైల్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. దర్శకత్వం వహించి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని దర్శకుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు అనిల్. ఆయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు టాలీవుడ్ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆ సినిమాను వీక్షిస్తారు. కచ్చితంగా సినిమా హిట్ అన్న నమ్మకంతో ఉంటారు.
అలా.. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా అనంతరం అనిల్ తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే చిరంజీవికి కథ వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక అనిల్ సినిమాలో తాను నటించబోతున్నట్లు చిరు అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈ సినిమా ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందని.. కథ చెప్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశా. ఎప్పుడు సెట్స్‌లోకి అడుగు పెడతానని ఆసక్తిగా ఉందంటూ చిరంజీవి ఈవెంట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట అనిల్ రావిపూడి. హీరోయిన్ సెలక్షన్ పూర్తవుగానే సినిమా ప్రారంభమవుతుందని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన మరొక క్రేజీ బజ్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలాను సెలెక్ట్ చేసినట్లు టాక్. దానికి అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఆ స్పెషల్ సాంగ్ కోసం తాను రూ. కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ చేయడానికి రూ.20 కోట్ల వరకు వెంచించనున్నాడట అనిల్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.