ఈ ఏడది టాలీవుడ్ ఇండస్ట్రీఅలో పండుగ వాతావరణం నెలకొంది. జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం, ఫిబ్రవరిలో తండేల్ సినిమాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుని విన్నర్‌లుగా నిలిచాయి. ఇలా.. నెల గ్యాప్‌తో వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే మార్చి నెల సగానికి వచ్చేసిన ఇంకా ఈ నెల డ్యూ హీట్ పడలేదు. కాగా ఈ వారం రెండు సినిమాలు.. తర్వాత వారం మరో సినిమా.. ఆఖరి వారం నాలుగు సినిమాల రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఏకంగా ఒక్క నెలలోనే ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం అంటే కచ్చితంగా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోవాలి.
ఈ నెలలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు ఇది కచ్చితంగా టఫ్ పోజిషన్. ఎందుకంటే ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు సినిమాలకు రారు. ఒకవేళ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా.. ఖాళీ అయిన తర్వాతే సినిమాను చూడడానికి ఇష్టపడతారు. అప్పటికి సినిమా థియేటర్లో ఉంటే లెట్ రన్నింగ్‌తో హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఈ వారం కిరణ్ అబ్బవరం దిల్‌రుబా, నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్ట్ సినిమాలు రెండు రిలీజ్ కానున్నాయి. కోర్ట్ ఎమోషనల్ జర్నీ.. ఇదో టీనేజ్ లవ్, కోర్ట్ డ్రామా. కనుక లవ్ స్టోరీ ఇక ప్రియదర్శి లాయర్‌గా పెద్ద రోల్ కాకపోవచ్చు.
మిగతా క్యారెక్టర్ల పైన సినిమా రన్ అవుతుంది. అందుకే.. మహారాజా లాంటి ఎమోషనల్ సినిమాల మాదిరి.. ఈ సినిమా ఆకట్టుకుంటేనే సక్సెస్ సాధించగలుగుతుంది. ఇక సినిమాకు ఓ మాదిరి టాక్ వచ్చిన సినిమా సక్సెస్ అందుకోవడం కష్టమే. మరో సినిమా కిరణ్ అబ్బవరం నటించిన దిల్‌రుబా. ఎమోషనల్ టచ్ ఉన్న లవ్ స్టోరీ. అగ్రెసివ్ కుర్రాడి లైఫ్ జర్నీ. పాటలు బాగున్నాయి. ట్రైలర్ చూస్తే మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇక.. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ అయ్యాక బాగుందని పాజిటివ్ టాక్ వస్తే.. యూత్ సినిమాకు బ్రహ్మరథం పడతారనడంలో సందేహం లేదు. ఈ సినిమాతో సక్సెస్ కొడితే మాత్రం మార్చి నెల విన్నర్ గా దిల్‌రుబా వుంటుంది. కాగా.. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టడం కాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.