ప్రణయ్ హత్య కేసులో అమృతపై అమృత చెల్లి షాకింగ్ కామెంట్స్..!

2018లో సంచలనగా మారిన ప్రణయ్ పరువుహత్య కేసు అందరికి గుర్తుండే ఉంటుంది. నల్గొండ ప్రాంతంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ హత్య కేసులో ఈరోజు కోర్ట్‌లో ఫైనల్ తీర్పును జారీ చేసింది. అమృత, ప్రణయ్ మాడర్ కేసులో.. మొత్తంగా 8 మందిని నిందితులను కోర్టుకు హాజరు పరచగా.. ఇందులో ఏ వన్ గా ఉన్న మారుతి రావు అప్పట్లోనే మరణించారు. అయితే ఆ తర్వాత ఏ 2గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ ఏ 6గా ఉన్నాడు.

Had no contact with him since Pranay's murder': Amrutha on father Maruthi Rao's death

దీంతో ఆయనకు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ క్రమంలోనే మొత్తం శ్రవణ్ కుటుంబం అంతా కోర్టు ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు.. అమృత తండ్రైన ఏ 1గా ఉన్న మారుతిరావు.. ఇద్దరు అన్నదమ్ములే. దీంతో పోలీసులతో సైతం కుటుంబ సభ్యులు తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని.. శ్రవణ్ కుమార్తె ఏడుస్తూ ఎమోషనల్ అయింది. ఈ కేసులో ఏ సంబంధం లేకుండా నా తండ్రిని అమృత కావాలని ఇరికిస్తూ వచ్చిందంటూ అమృత చెల్లి సంచలన ఆరోపణలు చేసింది.

దీంతో దినంతటికీ కారణం అమృతనే అంటూ.. ఆమె చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మొదటినుంచి శ్రవణ్ రావుకు.. ప్రణయ్ హత్యకేసుకు ఎలాంటి సంబంధం లేకుండా.. కుటుంబం కూడా వారిస్తూ వస్తున్న కావాలని త‌న తండ్రిని ఇరికించారని చెప్పుకొచ్చింది. అయితే.. ప్రణయ్ మర్డ‌ర్‌ జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న ఏపీ రంగనాథ్.. కోర్టు తీర్పు పై ప్రశంసలు కురిపించాడు. నేరస్తులకు శిక్ష పడడం ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా కొనసాగుతున్న ఆయన.. అమృత కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మారుతీ రావే.. కూతురి భర్తను చంపించడానికి సుఫారీ ఇచ్చి ప్రణయ్‌ను చంపించారట. ఇది రుజువు కావడంతో తాజాగా నిందితులకు శిక్ష పడింది.