బాలయ్య – ఏఎన్ఆర్ కలిసి ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించారా.. ఆ లిస్ట్ ఇదే..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాగా.. ఇటు సినీ రంగంతో పాటు, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నాడు. అలా ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకుని.. గాడ్ ఆఫ్ మాసెస్‌ బిరుదును దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ టాప్ లిస్టులో రాణిస్తున్నాడు. ఇటీవ‌ల వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లను అందుకున్న బాలయ్య.. రెండో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమా తర్వాత గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే.. తాజాగా బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇక బాలయ్య సినీ కెరీర్ స్టార్టింగ్‌లో తండ్రితో కలిసి.. ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి స్టార్ హీరోస్ అందరితో దాదాపు బాలయ్య మల్టీ స్టారర్లు నటించి ఆకట్టుకున్నాడు. ఇక.. ఏఎన్ఆర్‌తో బాలయ్య.. రెండు మల్టీ స్టార‌ర్ సినిమాలు నటించాడు.

Gandeevam Full Length Telugu Movie || Balakrishna, Nageswara Rao || Ganesh  Videos

1985లో బీ.బీ. రాజేంద్రప్రసాద్ డైరెక్షన్లో తెర‌కెక్కిన భార్యాభర్తల బంధం సినిమాలో ఏఎన్ఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న బాలయ్య.. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇందులో బాలయ్యకు జంటగా రాధ‌, ఏఎన్ఆర్ కు జంటగా జయసుధ మెరిశారు. ఇక అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే ఏఎన్ఆర్‌తో గాండీవం సినిమాలో కూడా బాలయ్య నటించి ఆకట్టుకున్నాడు. 1994 లో ప్రియదర్శన్‌ దర్శకుడుగా తెరకెక్కిన ఈ సినిమాల్లో సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా హీరోయిన్గా మెరిసింది. సినిమా అప్పట్లో యావరేజ్ టాక్‌ను దక్కించుకుంది.