స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు తర్వాత మెల్లమెల్లగా కెరీర్ బిల్డప్ చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. మొదట పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన డైరెక్టర్లను మెప్పించి.. హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సక్సెస్ లో అందుకొంటూ మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. స్వయంకృషితో స్టార్ హోదాను దక్కించుకుని ఇప్పటికి టాలీవుడ్ సీనియర్ హీరోగా రాణిస్తున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు కాలమవుతున్న మెగాస్టార్ క్రేజ్ కాస్త కూడా తగ్గలేదంటేనే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే తన సినిమాలతో ఎన్నో రికార్డులను కొలగట్టిన చిరు.. మధ్యలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఖైదీ నెంబర్ 150 మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా కనాకష్టమైపోయింది. కానీ.. ఒకప్పుడు మాత్రం నెలల వ్యవధిలోనే సినిమా షూట్ ను పూర్తి చేసి వరుసగా సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించేవాడు చిరు.
అలా సినిమాకు 150 నుంచి 200 రోజుల సమయం పడుతున్న కాలంలోనే.. కేవలం 29 రోజుల్లో ఓ సినిమా షూట్ ను పూర్తి చేసి ఆడియన్స్ పలకరించాడు. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు.. 1982లో రిలీజ్ అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవి హీరోయిన్గా నటించగా.. గొల్లపూడి మారుతి రావు డైలాగ్స్ అందించారు. అన్నపూర్ణ, పి.ఎల్ నారాయణ, గొల్లపూడి మారుతీరావు, సంగీత తదితరులు కీలకపాత్రలో మెరుశారు. సినిమా రిలీజ్ అయిన మొదట్లో యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నా.. కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. 8 కేంద్రాల్లో 50 రోజులు, రెండు కేంద్రాల్లో 100 రోజుల ఫుల్ రన్ ముగించి.. తర్వాత షిఫ్ట్ ల వారీగా 517 రోజుల రన్ టైం కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది.