సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో సినిమాల విషయంలో వినిపిస్తున్న పలు విమర్శలలో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే ఏజ్ గ్యాప్ కూడా ఒకటి. సీనియర్ స్టార్ హీరోలు, యంగ్ బ్యూటీలతో ఏజ్ గ్యాప్‌కు సంబంధం లేకుండా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంటున్నారు. ఇటీవల కాలంలోనే కాదు.. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ కొనసాగుతున్న ఈ జనరేషన్‌లో మాత్రం వీటిని భూతద్దంలో చూస్తూ ఆ స్టార్ హీరోలను ట్రోల్స్ చేస్తూ కించపరిచేలా ప్రయత్నిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్, మీమర్స్. ఇక మన టాలీవుడ్‌లో ఇప్పటికీ ఇలాంటి కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా.. కోలీవుడ్‌లో ఇదే అంశంపై ఒ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గాఆ మారింది. ఓ స్టార్ హీరో యంగ్ బ్యూటీ తో సినిమా నటించడమే దానికి కారణం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ముద్దుగుమ్మ అదే స్టార్ హీరో సినిమాల్లో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది.
ఆమె ఎవరో కాదు తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కృతి శెట్టి. ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పలేదు కదా.. ఆయన కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తెలుగు ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ హీరో మరెవరో కాదు కార్తీ. గతంలో కార్తి నటించిన ఓ సినిమాలో కృతి శెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఇప్పుడు అదే కార్తీ.. మూవీలో కృతి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం కార్తీ వయసు 46 ఏళ్ళు కాగా 21 ఏళ్ల వయసున్న కృతి శెట్టితో చిందేయనున్నాడు. వా వత్తియార్ సినిమాలో ఇద్దరూ కలిసి కనపడనున్నారు. కాగా వీరిద్దరి మధ్య ఏకంగా 15 ఏళ్ల ఏజ్ క్యాప్ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటి గ్యాప్ లు ఇండస్ట్రీలో చాలా సహజం. ఇప్పటికీ అలాంటి సందర్భాలు కూడా చాలాసార్లు రిపీట్ అయ్యాయి. అయినా.. ఈ జనరేషన్‌లో ఇదే మొదటిసారి కావడంతో.. ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ కృతి శెట్టి చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆ సినిమా ఏదో చెప్పలేదు కదా.. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చి రిస్ట్రిక్ థ్రిల్లర్ నా పేరు శివ. ఈ సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సినిమాల్లో కృతి శెట్టి, కార్తీకి చిన్న సీన్ కూడా ఉంటుంది. ఈ సన్నివేశానికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దీంతో అప్పుడు చైల్డ్ ఆర్టిసి గా కార్తీతో నటించిన కృతి ఇప్పుడు అతనితోనే రొమాన్స్ చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. కానీ మరి కొంతమంది మాత్రం సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని ఇలాంటివి ఎప్పటినుంచో జరుగుతున్నాయి అంటూ వెల్లడిస్తున్నారు.