టాలీవుడ్ అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని చైతు కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లకు అల్లగొట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది. చంద్రమోహన్ రెడ్డి డైరెక్షన్‌లో.. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. తిరుగులేని క్రేజ్ దక్కడమే కాదు.. నాగచైతన్య నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆయన గ్రాఫ్ మరింతగా పెరిగింది. ఇక తండేల్ ఎఫ్ట్‌తో నాగచైతన్య దశ తిరిగిపోయిందని.. నెక్స్ట్ సినిమా లైనాప్ మరింత క్రేజీగా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఇంతకీ నాగచైతన్య నెక్స్ట్ నటించబోయే సినిమాలు ఏంటి.. ఆ సినిమాల దర్శకుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా తీసేందుకు ముగ్గురు స్టార్ట్ డైరెక్టర్స్ క్యూ కట్టారట. అందులో ఒకటి ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందట. తమిళ్ మూవీతో సక్సెస్ అందించిన.. చందు మండేటితోనే నాగచైతన్య మరోసారి సినిమా చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. త్వరలో గొప్ప హిస్టారికల్ మూవీ వీరిద్దరి కాంబోలో ఉందట.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా సరికొత్త మేకోవర్‌తో తీయనున్నట్లు వెల్లడించారు. వాటితో పాటే.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో మిస్టరీ సినిమాలో నటించనున్నాడు చైతన్య. బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఆర్కా మీడియా వర్క్స్‌తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయం మాత్రం రివిల్ కాలేదు. ఆ డిటేయిల్స్ తెలియిలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.