యంగ్ బ్యూటీ శ్రీ లీలకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. వరస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది. ఇక ఇటీవల తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన్న శ్రీ లీలా.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్.. కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్, అనురాగ్ బసు డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ బాలీవుడ్ మూవీలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయ్యిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాలో కార్తీక్ ఆర్యన్.. బారి జుట్టు, గుబురు గడ్డంతో సింగర్‌గా కనిపించగా.. శ్రీ లీల అతడి లవర్ పాత్రలో మెరవనుంది.
ఇక శ్రీలీల ఈ సినిమా కోసం రొమాన్స్ డోస్ ను మరింతగా పెంచినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. గ్లింప్స్ చూసిన వారందరికీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆషికి ఫ్రాంచౌజ్ సినిమాగా అనిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకు టైటిల్ ఖరారు చేయని మేకర్స్.. సినిమాను దీపావళిలో రిలీజ్ చెయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో శ్రీ లీల గ్లామర్‌తో కుర్రాళను కట్టిపడేయడం ఖాయం అనేలా అమ్మడు లుక్స్ కనిపించాయి. అంతేకాదు.. కార్తీక్ ఆర్యన్‌తో ఘాటు లిప్ లాక్‌తోను కుర్ర కారును కవ్వించింది. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయినా అందరూ హీరోయిన్స్‌లానే బాలీవుడ్ కి వెళ్ళగానే శ్రీలీల కూడా పూర్తిగా రూటు మార్చేసి గ్రామర్ రూట్లోకి వెళ్లిపోయింది.
ఆషికి సీక్వెల్ కథగా ఇది వస్తే మాత్రం ఈ మూవీకి బేరే లెవెల్‌లో క్రేజ్‌ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక శ్రీ లీలకు కూడా ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఆషీకీ 2 లో శ్రద్ధ కపూర్ నటించగా అమ్మడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని.. టాప్ లీగ్ లోకి చేరుకుంది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ సినిమానే ఇలాంటి బ్లాక్ బస్టార్ ఫ్రాంచైజ్‌లో సినిమా రావడం అమ్మడి అదృష్టం అనడంలో అతిశయోక్తి లేదు. ఏదేమైనా శ్రీలీలకు ఈ ఆఫర్ ఆమె కెరీర్‌లోనే పాన్ ఇండియా పాపులారిటీకి ఉపయోగపడుతుందని.. అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టాలీవుడ్‌లో అమ్మడు నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.