మత్తు కళ్ళు, ఘాటు అందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అలనాటి స్టార్ బ్యూటీ సిల్క్ స్మీతకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాలో నటిస్తుందంటే చాలు దాదాపు ఆ సినిమా సూపర్ హిట్ అని అంత భావించేవారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం వేచి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సినీ కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను కొనసాగించిన ఈ అమ్మడు.. ఒకానొక టైంలో ఇండస్ట్రీలో అందరినీ వెనక్కి నెట్టేసింది. అతి తక్కువ సమయంలో అత్యధిక మార్కెట్‌తో పాటు.. కోట్ల డడబ్బు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ.. తన చివరి రోజుల్లో మాత్రం చాలా నరకాన్ని చూసి కనుమూసింది.
చిన్నతనం నుంచే కుటుంబంలో ఎన్నో విధాలుగా ఆర్థిక సమస్యలను, మానసిక సమస్యలను ఎదుర్కొన్న ఈ అమ్మడు.. చదువుకోవాలని కోరిక ఉన్న తల్లిదండ్రుల కోసం చదువు మానేసి పెళ్లికి సిద్ధమైంది. వివాహం తర్వాత సిల్క్ స్మిత లైఫ్ అంధకారంలోకి వెళ్ళింది. అత్తింటి నుంచి భర్త, అత్తమామల నుంచి వేధింపులు తాళలేక ఇంట్లో నుంచి పారిపోయిన సిల్క్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా నటిగా అవకాశాలు దక్కించుకుంది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే కసితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మరణించే సమయానికి కోట్ల ఆస్తి అధిపతి. కానీ ఆమె మరణాన్ని మాత్రం ఆ డబ్బు ఆపలేకపోయింది.
అయితే సిల్క్ మరణానికి ఎంతోమంది కారణమంటూ ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి. సినీ సెలెబ్రిటీలు కూడా ఆమె మరణానికి కారణం అంటూ టాక్ నడిచింది. అందులో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా వినిపించడం ఆశ్చర్యం. సిల్క్ స్మిత సినిమాల్లో రాణిస్తున్న క్రమంలో రజనీకాంత్‌కి, ఆమెకు మధ్య ప్రేమాయణం నడిచిందని.. రజనీకాంత్ నటించిందని.. సినిమాల్లో స్మిత తప్పకుండా ఉండేలా చూసుకునే వారిని.. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ చాలా కాలమే కొనసాగింది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అంతే కాదు వీరిద్దరూ ఒకే రూమ్లో దొరికారుటూ కూడా టాక్ నడిచింది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఆమె చనిపోయి చాలా ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికి చాలా సందర్భాల్లో ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.