టెంపర్@10: ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇవే.. ఎన్ని కోట్లు లాభం అంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్. పూరి జగన్నా డైరెక్షన్లో.. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వ‌చ్చి భారీ స‌క్స‌స్ అందుకోవ‌డ‌మే కాదు ఎన్నో రికార్డులు సృష్టించింది. 2015 జనవరి 13న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రిలీజై.. తాజాగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Temper' Movie Review: Viewers Call it Grand Treat For Junior NTR Fans -  IBTimes India

ఈ క్ర‌మంలోనే సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రాన్‌ కంప్లీట్ అయ్యేసరికి.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు కలెక్షన్లు వచ్చాయి.. సినిమా లాభాలతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అనే న్యూస్ మరోసారి వైరల్ గా మారుతుంది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి నైజాం ఏరియాలో రూ.11.20 కోట్ల కలెక్షన్లు రాబట్టగా.. సీడెడ్ లో రూ.6.2 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.55 కోట్లు, వెస్ట్ లో రూ. 1.75 కోట్లు, గుంటూరులో రూ.3.2 కోట్లు, కృష్ణలో రూ.2.8 కోట్లు, నెల్లూరులో రూ. 1.30 కోట్ల వరకు కలెక్షన్లు కల్లగొట్టింది.

Watch Temper (Telugu) Full Movie Online | Sun NXT

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.31.35 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.6.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.5 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం. అలా మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43.10 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేసింది. దాదాపు 10 ఏళ్ల క్రితమే ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టెంపర్.. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ టైం పూర్తయ్యేసరికి.. రూ. 43.1 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. తర్వాత రూ.1.1కోట్లు లాభాలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హీట్‌గా నిలవడం విశేషం.