టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. గత కొంతకాలంగా ఒక సరైన హిట్ కూడా లేదు. ఈ క్రమంలోనే 2023 లో వచ్చిన ఖుషి సినిమా యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్న కలెక్షన్లలో మాత్రం డిజాస్టర్‌గా నిలిచి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తర్వాత.. ఫ్యామిలీ స్టార్‌తో గత ఏడాది ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా కూడా ఊహించిన సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ కింగ్‌డమ్‌తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని తెగ ఆరాటపడుతున్న విజయ్.. ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టేసాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
దీనికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. దీంతో.. టీజర్ మరింత పాపులర్ అయింది. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. కింగ్‌డమ్ సినిమాకు మొదట చాయిస్ విజయ్ దేవరకొండ కాదని.. గౌతమ్ తిననూరి మొదట ఓ మెగా హీరో కోసం ఈ కథను రాసుకున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరో కాదు.. రామ్ చరణ్. రామ్ చరణ్‌తో ఈ సినిమాను చేయాలని గౌతం తిన్ననూరి భావించాడట. అంతేకాదు.. అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. గౌతమ్ తిన్ననూరి, చరణ్ కాంబోలో ఆర్సి 16 సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత గౌతమ్.. హిందీలో తీసిన జెర్సీ మూవీ ఫ్లాప్ కావడంతో ఎఫెక్ట్ తన సినిమాపై పడకూడదని గౌతమ్ తిన్నానూరి సినిమా రిజెక్ట్ చేశాడట చరణ్.
అలాగే చరణ్‌కు ఈ సినిమా స్టోరీ కూడా అంతగా నచ్చలేదని.. ఓ రూమర్ కూడా వైరల్ అవుతుంది. కానీ.. అసలు మ్యాటర్ ఏంటంటే స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చాలని.. చరణ్ చెప్పడంతో వెంటనే.. చిరంజీవి దగ్గరకు గౌతమ్ ఆ లైన్ తీసుకువెళ్లారట. చిరుకి కథ వినిపించగా.. స్టోరీలో డెప్త్ అంతగా లేదని తన కొడుకు ఇలాంటి సినిమాలకు సెట్ కాడని చిరంజీవి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక చరణ్, చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేయడంతో ఇది కాస్త రౌడీ హీరో అకౌంట్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రౌడీ హీరో. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే మాత్రం చరణ్ ఒక మంచి సినిమా మిస్ చేసుకున్నట్లే. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు. ఒకవేళ ఫలితం అటు.. ఇటు.. అయితే మాత్రం మరో ఫ్లాప్ నుంచి చరణ్ తప్పించుకున్నట్లు అనుకోవచ్చు. ఇక ఈ ఏడది మే 30న రిలీజ్ కానున్న సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.