టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చరణ్ నుంచి చివరిగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో.. తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు చరణ్. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకోవాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఆర్సి 16 రన్నింగ్ టైటిల్‌తో సినిమాను నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే సుకుమార్ తో తన 17వ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కావడానికి ఎంత లేదన్న దాదాపు రెండున్నర, మూడేళ్లు టైం పట్టనే పడుతుంది. ఇంత బిజీ లైనప్ లోను చరణ్‌తోనే సినిమా తీయాలని క్యూలో ఉన్నారు ముగ్గురు స్టార్ డైరెక్టర్స్.
చరణ్ కోసమే ఆ సినిమా కథలు రాసుకున్నామని.. ఐదేళ్ల తర్వాత డేట్లు ఇచ్చిన పర్లేదు అప్పుడే చరణ్‌తో సినిమా చేస్తాం అనేంతలా చరణ్ కోసం ఆ ముగ్గురు స్టార్ట్ డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఆ దర్శకుల లిష్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ స్టార్ మేకర్ నిఖిల్ నగేష్. చరణ్ ఇమేజ్ కి తగ్గ డిఫరెంట్ కథను సిద్ధం చేసుకున్నాడట. అది పౌరాణిక నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. ఇక చరణ్‌కు ఈ స్టోరీ వినిపించాడా.. లేదా.. క్లారిటీ లేకున్నా.. కచ్చితంగా కథను వినిపించగానే.. చరణ్ నో చెప్పడని ఫుల్ కాన్ఫిడెన్స్ తో నిఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు నుంచి హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యవ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
హయ్ నాన్న కధ పరంగా విమర్శకులతోను ప్రశంసలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే శౌర్యవ్ చరణ్ కోసం ఒక కథను రెడీ చేశాడట. చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని స్టోరీని రాసుకున్నాడని సన్నిహిత వర్గాలు నుంచి టాక్ నడుస్తుంది. అలాగే మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఓ దర్శకుడు చరణ్‌తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడట. చరణ్ కూడా ఆయనతో సినిమా చేయాలని ఉందంటూ గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడు చరణ్ కోసం తను కూడా ఓ స్టోరీని సిద్ధం చేసి సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట. ఇక చరణ్ ఈ ముగ్గురిలో ముందు ఎవరితో సినిమా చేస్తాడో వేచి చూడాలి.