సౌత్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. టాలీవుడ్ సినిమాల్లో నటించి దాదాపు రెండు ఏళ్ళు గడిచిపోతున్నా.. ఇప్పటికీ అమ్మడకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇక నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఏ చిన్న పోస్ట్ చేసిన.. అప్డేట్ ఇచ్చినా.. క్షణాల్లో అది వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సామ్ మాజీ భర్త నాగ చైతన్య, హీరోయిన్ శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైందని.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో ఆమె ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఐనప్పటికీ ఈ వార్తలపై ఇద్దరు రియాక్ట్ కాకపోవడంతో.. వాస్తవం లేదని అభిమానులంతా భావించారు. కానీ.. ఇటీవల పికిల్ బాల్ టోర్నమెంట్‌లో రాజ్ చేతిలో చేయి వేసుకొని మరి సమంత క్లోజ్ గా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం.. గ్రౌండ్ అంతా అతని వెంటే తిరగడం.. అతనితో బాగా క్లోజ్ గా కనిపించడంతో.. వీరి ప్రేమ వార్తలుకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే సమంత వ్యాలెంటెన్స్ డే సందర్భంగా చేసిన పోస్ట్ మరింత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.
ఇక ఆమె చేసిన పోస్ట్ చూసిన వారంతా నిజంగానే సమంత వేరే వారితో ప్రేమలో ఉందని.. త్వరలోనే రెండో పెళ్లి వార్తలు నిజం చేస్తుంది అనేలా కామెంట్‌లు వినిపిస్తున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లో జస్ట్ ఆర్.. మే బీ మోర్.. అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది సమంత. వాటిలో మూడు ఫోటోలు ప్రేమ పార్ట్నర్ గురించి హింట్ ఇస్తున్నట్లుగా చూపించింది. ఒక పిక్‌లో ఆల్ ది లిటిల్ థింగ్స్ అంటూ కొన్ని పాయింట్స్‌ని షేర్ చేసుకున్న ఈ అమ్మడు.. మరో పిక్ లో పార్ట్నర్కు చీర్స్ కొడుతున్నట్లుగా.. ఇంకో పిక్ లో ఒక క్లాత్ మీద లవ్ సింబల్ స్ట్రిచ్ చేసి ఉన్న ఫోటోలను ఉంచింది. దీంతో మొత్తానికి సమంత మరోసారి రెండో పెళ్ళికి సిద్ధమవుతుందని.. ఇన్ డైరెక్ట్ గా తాను ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇస్తుందని.. త్వరలోనే పీపీ డుండుం పక్క అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.