ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలను రూపొందించేందుకు దర్శక, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు, స్పెషల్ ఎఫెక్ట్స్, సిజ్ వర్క్ కారణంగా సినిమా పూర్తయి తెరపైకి ఓ సినిమా రావడానికి సంవత్సరాల సమయం పడుతుంది. అలాగే పలువురు స్టార్స్ ఒక్కో సినిమా కోసం సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. మరికొందరు వెంట వెంటనే ఒకదాని తర్వాత.. ఒకటి సినిమాలను చేస్తూ ఏడాదిలోనే అత్యధిక సినిమాలు నటించి సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటుడు కూడా అదే కోవకు చెందుతాడు. ఇంతకీ అతను ఎవరు.. అసలు ఆయన క్రియేట్ చేసిన రికార్డు ఏంటో ఒకసారి చూద్దాం.
ప్రస్తుతం ఉన్న హీరోలలో ఏడాదికి వరుస పెట్టి సినిమాలో నటించిన మూడు లేదా నాలుగు మహా అయితే ఐదు సినిమాలు చేయడమే పెద్ద సంచలనం. అలాంటిది ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్న ఓ నటుడు.. ఒకే ఏడాదిలో ఏకంగా 36 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించాడు. అతను మరెవరు కాదు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి. 1971లో అనుభవంగాల్ పాలించకల్ అనే సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. తర్వాత 1980లో మేళా సినిమాతో హీరోగా మారాడు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోగా మారిపోయాడు. అలా 1982లో మమ్ముట్టి ఏకంగా 24 సినిమాల్లో నటించాడు. ఇక 1983 నుంచి 1986వ సంవత్సరం వరకు ప్రతి ఏడాదిలో 36 ,34, 28, 35 సినిమాల్లో నటించి సంచలనాలు క్రియేట్ చేశాడు.
అతన్ని డెడికేషన్ కు, ఇండస్ట్రీలో కష్టపడి పని చేసిన ఆమె పనితీరుకు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. హీరోగా మమ్ముట్టి ఏకంగా 400 పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించాడు. 1987లో ఒక సంవత్సరంలోనే 36 సినిమాల్లో నటించగా.. అతని తనయుడు దుల్కర్ సల్మాన్ ఆ సంఖ్యను చేరుకోవడానికి తన 13 ఏళ్ల సినీ కెరీర్ సమయం పట్టింది. 1987లో ఆయన తీసిన ఆ రాత్రి.. కోటి రూపాయల కలెక్షన్లు కల్లగొట్టిన మొట్టమొదటి మలయాళ సినిమా గా నిలిచింది. అంతేకాదు.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన మమ్ముట్టి.. మతిల్ సినిమాకు తన మొట్టమొదటి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాలో ఆయన పాత్ర.. నటన తీరు మరోసారి మమ్ముట్టికి నేషనల్ అవార్డును తెచ్చి పెట్టింది. అలా మమ్ముట్టి తమిళ్, తెలుగు, కన్నడ, హింద సినిమాల్లో వరసగా నటిస్తూ ఇప్పటికీ బిజీ స్టార్ గా రాణిస్తూనే ఉన్నాడు.