టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మలువుడ్ అని ఇండస్ట్రీలు కాదు.. భారతీయ సినీ ఇండస్ట్రీ అనేది మన నినాదం అంటూ డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హాలీవుడ్‌ను అను కరించడం మానేసి.. మనదైన స్టైల్ లో మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించేలా కృషి చేయాలంటూ కామెంట్‌లు చేశాడు. డబ్బులు సంపాదించడమే సినిమాల లక్ష్యం కాదని.. మంచి విలువలు నేర్పించాలి.. సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు అందించాలి.. తెలుగు సినీ ఇండస్ట్రీ సమాజాన్ని ఆలోచింపజేసే బాధ్యతతో సినిమాలు తీయాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు.
శనివారం రాజమండ్రిలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు కీయారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర కీలకపాత్రలో మెప్పించనున్నారు. ఇక ఈ సినిమా ఈనెల 10 థియేటర్లలో రానుంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ.. పవన్, చరణ్ ఇలా ఏ హీరో ఉన్నా దానికి మూలం చిరంజీవి.. మీరు గేమ్ ఛేంజర్, ఓజి, డిప్యూటీ సీఎం పిలిచేది ఏదైనా దాన్ని అంతటికీ మూలం చిరంజీవి గారే. ఆయన నాకు అన్నయ్య కాదు పితృ సమానులు.. మా వదిన అమ్మతో సమానం.. నేను ఆ మూలాలు ఎప్పుడు మర్చిపోను అంటూ పవన్ వెల్లడించాడు.
ఎక్కడో చిన్న కూగ్రామం నుంచి వచ్చి స్ట్రాంగ్‌గా ఒక్కడే నిలబడి.. పెరిగి పెద్దవాడై అందరికీ ఆశ్రయం ఇచ్చాడు. ఊతమిచ్చాడు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు మేమంతా ఇలా ఉన్నాం. అందరూ వెళ్లడానికి భయపడే మారుమూల గ్రామాలకు నేను ఈరోజు ఒంటరిగా ఎలాంటి భయం లేకుండా వెళ్లి.. రోడ్లు వేయించగలుగుతున్నానంటే.. దానికి మూలాలు అన్నయ్య ఇచ్చినవే. మేమెప్పుడూ అందరూ బాగుండాలి.. అన్ని సినిమాలు ఆడాలి అని కోరుకుంటాం.. ఆ హీరో సినిమా పోవాలని.. ఈ హీరో సినిమా పోవాలని కోరుకునే సంస్కృతి మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. సర్వేజనా సుఖినోభవంతు అన్నదే మా తండ్రిగారు మాకు నేర్పించారు అంటూ వెల్లడించాడు. ఇక భారతీయ సినిమాకు ఇంటర్నేషనల్ ఖ్యాతి తెచ్చిన వారిలో దక్షిణాది దర్శకులు కొందరు ఉన్నారు. వారిలో శంకర్ కీలకమైన వ్యక్తి. ఆయన అనువాద తెలుగు సినిమాలను ఇక్కడ ఆడియన్స్ ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారు. అన్ని వయసుల వాళ్లను సినిమా ఆకట్టుకోవడమే కాదు.. ఒక సోషల్ మెసేజ్ తో శంకర్ గారి సినిమా ఉంటుంది అంటూ శంకర్ ప్రశంసించాడు. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.