‘ అన్ స్టాపబుల్ ‘ లో తారక్ ను దారుణంగా అవమానించిన బాలయ్య.. వీడియో వైరల్

గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీలో అంతర్గ‌త వార్ జరుగుతుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎన్టీఆర్, బాలయ్య మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని.. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనీసం దానిపై రియాక్ట్ కాకపోవడం.. ఒక‌సారి కూడా క‌ల‌వాల‌ని అనుకోక‌పోవ‌డం దానికి కారణం అంటూ ఎన్నో కథనాలు వైరల్‌గా మారాయి. అయితే దీని తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంతకి అస‌లు మ్యాటర్ ఏంటంటే.. నిన్న రాత్రి 7 గంటలకు బాలయ్య హోస్ట్గా వివరించిన‌ లేటెస్ట్ ఎపిసోడ్ అహ మీడియాలో స్ట్రీమింగ్ అయినా సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు డాకు మహారాజ్ మూవీ టీం తరఫున మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్, డైరెక్టర్ బాబి, ప్రొడ్యూసర్ నాగవంశీ వ‌చ్చి సందడి చేశారు.

Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్‌లో షోలో డాకు మహారాజ్ టీమ్.. బాలయ్యతో  కలిసి డైరెక్టర్ బాబీ సందడి.. - Telugu News | Daaku Maharaaj Movie Team Director  Bobby Kolli, Producer Naga vamsi ...

వీళ్ళతో బాలయ్య సరదాగా ముచ్చటించాడు. ఇక బాలయ్య.. సరదాగా జరిపే బాలయ్య అన్‌స్టాపబుల్ సంభాషణ ఆడియోస్ ను ఆకట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బాలయ్య బాబికి ఎల్ఈడి పై.. కొందరు హీరోల ఫోటోలు చూపించి వాళ్ల గురించి ప్రశ్నలు సంధించాడు. బాబి ఇప్పటివరకు పని చేసిన హీరోలు అందరి ఫోటోలు చూపించి వాళ్ల గురించి ఓ మాట చెప్పాలని కోరాడు. అయితే ఆ ఫోటోలలో ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను మాత్రమే మినహాయించాడు. జూనియర్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ బాబి జయ లవకుశ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాబి కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్. అలాంటి సినిమాలో నటించిన హీరోని వదిలేసి ఆయన డైరెక్టర్ గా వ్యవహరించిన‌ మిగతా హీరోల ఫోటోలు చూపించు ప్రశ్నలు సంధించాడు.

Watch Jai Lava Kusa (Telugu) Full Movie Online | Sun NXT

దీన్ని చూసిన తారక్‌ అభిమానులు కావాలనే ఎన్టీఆర్‌ను పట్టించుకోలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య మొదటి నుంచి తారక్ అంటే అసూయతో ఉంటారని.. ఆ కారణంతోనే ఇలా చేశాడని.. బాలయ్య పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. తారకరత్న చనిపోయినప్పుడు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ అక్కడికి వెళ్తే బాలయ్య పట్టించుకోలేదని.. అప్పటి నుంచే ఎన్టీఆర్ కూడా బాలయ్య కి దూరం ఉండడం మొదలుపెట్టాడని ఈ క్రమంలోనే నందమూరి కుటుంబంలో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా తారక్, కళ్యాణ్ రామ్ విళ్ళ‌డం మానేసాడంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో మాత్రం తారక్‌, కళ్యాణ్ రామ్ స్నేహపూర్వక వాతావరణాన్ని మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్ష‌జ్ఞ‌ ఫస్ట్ మూవీ పాస్టర్ ని తారక్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేశాడు.