మెగ పవర్ స్టార్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి వేదికగా గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. ఈ ఈవెంట్ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక.. డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మొదట పాల్గొన్న సినిమా ఈవెంట్ ఇదే కావడం విశేషం. మెగా పవర్ స్టార్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా పవర్ స్టార్ వచ్చి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. సుదీర్ఘ స్పీచ్ ఇచ్చిన పవన్.. తన మూలాలను మర్చిపోను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనతో పాటు మెగా హీరోలు అందరికీ మూలం తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకొచ్చిన పవన్.. మీరు కళ్యాణ్ బాబు అనండి, డిప్యూటీ సీఎం అనండి ఏదైన దానికి చిరంజీవి నే కారణం.
నేను ఎప్పుడు మూలాలు మర్చిపోలేదు. మర్చిపోను అంటూ వెల్లడించాడు పవన్ కళ్యాణ్. ఇక చరణ్ ఈ స్థాయికి మిగత హీరోలు ఉన్నా దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని.. ఆయన క్లియర్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమ పట్ల చెన్నై నుంచి తెలుగు రాష్ట్రాలకు తేవడంలో కృషి చేసిన అలనాటి హీరోలు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులను గుర్తు చేస్తున్న పవన్ వాళ్ళను ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీ మరువదని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ మూలాలు వాళేనంటూ రఘుపతి, వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే సహా ఎంతో మంది పేర్లను పవన్ ప్రస్తావించాడు. ఇక పవన్ మూలాలు మర్చిపోకూడదు చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ఎంతో మంది రియాక్ట్ అవుతూ.. అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్ట్ గా పవన్ ఇలాంటి కామెంట్స్ చేశారని.. కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్.. చిరు వల్లే తన ఇండస్ట్రీలో మద్దతు దక్కించుకుని.. ఎదిగి ఐకాన్ స్టార్ గా మారాడని ఎక్కడ ఆయన పేరు ప్రస్తావించడం లేదని.. దాని గురించి పవన్ ఇన్‌డైరెక్టుగా మూలాలు మరవద్దని మాట చెప్పారని వివరిస్తున్నారు. అంతేకాదు అందరి హీరోల సినిమాలు ఆడాలని తాము అనుకుంటామని.. జూనియర్ ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ పేర్లు ప్రస్తావించి వారితో పాటు అందరి సినిమాలు విజయాలు సాధించాలని మా కుటుంబ భావిస్తుందని.. ఏ హీరో సినిమా కూడా పోవాలని ఎప్పుడు కోరుకోలేదని.. ఎప్పటికీ ఏ హీరోని మేము ద్వేషించమని.. పవన్ కళ్యాణ్ వెల్లడించాడు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించినవే అంటూ పలువురు నెటిజన్‌లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.