తాజాగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులతో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే మనం ఎక్కడి నుంచి వచ్చాము మూలాలు మర్చిపోలేము అని రఘుపతి, వెంకయ్య నాయుడు ,దాదాసాహెబ్ ఫాల్కే, నాగిరెడ్డి, ఎన్టీఆర్ తో సహా ఎంతోమంది ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేశారని వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను అంటూ వెల్లడించాడు. అలాగే ఇప్పుడు పవన్, చరణ్ ఇద్దరు ఉన్నారంటే దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు.. గేమ్ ఛేంజర్, ఓజి రెండు చిరంజీవి వాల్లనే ఎక్కడో మొగల్తూరు అనే గ్రామంలో పుట్టి చదువుకున్నాడాయన.. మేము ఏ రేంజ్ కు వెళ్లిన మా అందరికీ ఆయనే ఆధ్యుడు అంటూ చెప్పుకొచ్చాడు.
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి పెరగడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఎంతగానో కృషి చేశారని.. వారికి నా నమస్కారాలు. ఈరోజు ఓ భారీ సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే నారా చంద్రబాబు గారి ఆశీస్సులు దానికి కారణం. హోమ్ మినిస్టర్ అనితకు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. శంకర్ గారు తీసిన జెంటిల్మెన్ సినిమా చెన్నైలో బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశా. ఈ సినిమాకు మా అమ్మ నాన్నని కూడా తీసుకెళ్లా. అన్ని వయసుల వాళ్ళను ఆకట్టుకునేలా, సోషల్ మెసేజ్ ఉండేలా సినిమాలను తెరకెక్కిస్తారని.. శంకర్ దక్షిణ పరిశ్రమకు చెందిన గొప్ప సినిమాలు తీస్తాడంటూ వెల్లడించాడు.
ఇక శంకర్ తమిళ్ లోనే సినిమాలు తీస్తారు. తెలుగులో కూడా తీయచ్చు కదా అని ఎప్పుడూ అనుకునేవాడిని.. గేమ్ ఛేంజర్‌తో ఆ కోరిక తీరింది అంటూ చెప్పుకొచ్చాడు. దిల్‌రాజు నా తొలిప్రేమ మూవీకి డిస్ట్రిబ్యూటర్. నా దగ్గర డబ్బులు లేనప్పుడు వకీల్ సాబ్ అనే సినిమా చేసి జనసేన పార్టీ నడపడానికి అవసరమైన ఇందరంగా మారారు అంటూ వెల్లడించాడు. ఇక రామ్‌చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయ అనిపిస్తుందని.. అతను హీరో అవ్వడానికి ఎంతో కష్టపడ్డాడు అంటూ చరణ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అలాగే మెగాస్టార్ ను ప్రశంసించిన పవన్ ఇప్పుడు చరణైన నేనైనా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఆయననంటూ వివరించాడు. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.